రైతుల ఆందోళనకు మద్ధతుగా జంతర్ మంతర్ వామపక్షాల నిరసన ప్రదర్శన
ప్రదర్శనలో పాల్గొన్న వివిధ వామపక్షాలు, ప్రజా సంఘాలు
కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
''రైతాంగానికి వ్యతిరేకంగా కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. రైతులకు మద్ధతుగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. పార్లమెంటులో చర్చించకుండా.. ఇప్పుడు ప్రతి క్లాజుపై చర్చించాలని అంటోంది. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మద్ధతు ధర ఇవ్వడానికి సిద్ధమని చెబుతూ చట్టంలో చేర్చలేదు. మద్ధతు ధరపై ప్రత్యేకంగా చట్టమూ తీసుకురాలేదు. ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం.''
- బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు