ETV Bharat / bharat

కరోనాతో కఠిన ఆంక్షల దిశగా పలు రాష్ట్రాలు - రాత్రి కర్ఫ్యూ రాష్ట్రాల జాబితా

దేశంలో కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతున్న వేళ కఠిన చర్యలతో పాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి పలు రాష్ట్రాలు. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో లాక్​డౌన్​ తరహా కఠిన ఆంక్షలు విధిస్తూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు. ఇంకా హరియాణా, మధ్యప్రదేశ్​లోని పలు జిల్లాల్లోనూ రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.

night curfew
రాత్రి కర్ఫ్యూ
author img

By

Published : Apr 14, 2021, 6:45 AM IST

భారత్​లో కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. మొదటి దశ కంటే.. రెండో దశలో కేసులు భారీగా నమోదవుతుండటంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు, లాక్‌డౌన్ల దిశగా కదులుతున్నాయి. కఠిన చర్యలు చేపడుతూ వైరస్‌కు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

తాజాగా హరియాణాలో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇక భోపాల్‌లో ఏడు రోజుల రాత్రి కర్ఫ్యూకి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. సోమవారం నుంచి ఏప్రిల్‌ 19 వరకూ ఇది అమల్లో ఉండనుంది.

దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్న రాష్ట్రాలివే..

మహారాష్ట్ర

దేశంలో కొవిడ్‌కు ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్రనే. దేశవ్యాప్తంగా నమోదువుతున్న కేసులు, మరణాల్లో దాదాపు సగం ఇక్కడి నుంచే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తరహా కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా ఈ నెల 14 రాత్రి 8 గంటల నుంచి.. మే 1 ఉదయం 7 గంటల వరకు 15రోజుల పాటు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మహారాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, పార్కులు, జిమ్‌లు మూసేస్తున్నామని వెల్లడించారు.

ఆంక్షల నేపథ్యంలో పేదలకు 3 కిలోల గోధుమలు, 2 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని... ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులకు 15 వందల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌

  • సోమవారం నుంచి ఏప్రిల్‌ 19 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ
  • బర్వానీ, రాజ్‌గఢ్‌, విదీషా జిల్లాల్లో ఈ నెల 19 వరకూ లాక్‌డౌన్‌
  • బాలాఘాట్‌, నర్సింగ్‌పూర్‌, సియోనీ, జబల్‌పూర్‌లో ఏప్రిల్‌ 22 వరకూ 10 రోజుల లాక్‌డౌన్‌

ఉత్తరప్రదేశ్‌

  • మథుర, గోరఖ్‌పుర్‌, లఖ్‌నవూ, కాన్పుర్‌, గౌతమ్‌ బుద్ధానగర్‌, అలహాబాద్‌, మేరఠ్‌, గాజియాబాద్‌, బరేలీ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ

కర్ణాటక

  • రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో 11 రోజుల రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏప్రిల్‌ 10 నుంచి 20 వరకూ బెంగళూరు, మైసూర్‌, మంగళూరు, బీదర్‌, తుమకూర్‌, ఉడుపి ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ.

హరియాణా

  • రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

జమ్ముకశ్మీర్‌

  • ఎనిమిది జిల్లాల్లో(జమ్ము, శ్రీనగర్‌, ఉధంపూర్‌, బారాముల్లా, కథువా, అనంత్‌నాగ్‌, బుడ్గామ్‌, కుప్వారా) రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకూ కర్ఫ్యూ.

రాజస్థాన్‌

  • అజ్మేర్‌‌, అల్వార్‌, భిల్వారా, చిత్తోర్‌గఢ్‌, దుంగార్‌పూర్‌, జైపుర్‌, జోధ్‌పుర్‌, కోటా తదితర ప్రాంతాల్లో ఏప్రిల్‌ 30 వరకూ రాత్రి కర్ఫ్యూ

గుజరాత్‌

  • జామ్‌నగర్‌, భావ్‌నగర్‌, జునాగఢ్‌, గాంధీనగర్‌, ఆనంద్‌, నదియాడ్‌, మోర్బీ, దహోడ్‌, పఠాన్‌, భుజ్‌, గాంధీధామ్‌, భరూచ్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌, వడోదరలో ఏప్రిల్‌ 30 వరకూ రాత్రి కర్ఫ్యూ.
  • ఏప్రిల్‌ 30 వరకూ దిల్లీలో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.
  • పంజాబ్‌ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది.
  • ఒడిశాలో సుందర్‌భాగ్‌, ఝార్సుగూడ, సంబల్‌పూర్‌, బర్గాఢ్‌, నౌపడ, కలాహండి, కోరాపుత్‌, మల్కన్‌గిరిలోనూ అమల్లో రాత్రి కర్ఫ్యూ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.