ETV Bharat / bharat

'దిల్లీ సరిహద్దుల్లోనే రైతుల నూతన సంవత్సర వేడుకలు' - రైతు సంఘాల భేటీ

దిల్లీ సరిహద్దుల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరపాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. రైతులకు మద్దతుగా నిలవాలని ప్రజలకు కోరాయి. ట్రాక్టర్​ ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు రైతు నేతలు.

limited Year celebrations  Farmers protesting at Singhu border
'దిల్లీ సరిహద్దుల్లోనే రైతుల నూతన సంవత్సర వేడుకలు'
author img

By

Published : Dec 31, 2020, 7:11 PM IST

నూతన సంవత్సర వేడుకలను దిల్లీ సరిహద్దుల్లోనే నిర్వహించాలని సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతు సంఘాలు నిర్ణయించాయి. శుక్రవారం కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా.. రైతులకు మద్దతుగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చాయి. రైతుల డిమాండ్లు నెరవేరే వరకు మద్దతివ్వాలని ప్రజలను కోరాయి.

శుక్రవారం మధ్యాహ్నం సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నాయకులు భేటీ కానున్నారు. జనవరి 4న కేంద్రంతో జరిగే చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే.. ట్రాక్టర్ ర్యాలీని వాయిదా వేసినట్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి : సాగు చట్టాల ఉపసంహరణకు 'కేరళ' తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.