మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్(62)(Shivraj Singh Chauhan age) దమ్ముంటే తనతో రన్నింగ్ రేస్‌కు రావాలని సవాల్ చేశారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్(72)(Kamal Nath age). పదేపదే తన ఆరోగ్యం, వయసు గురించి విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"నా ఆరోగ్యంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కమల్‌నాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, వృద్ధుడని శివరాజ్ చెబుతున్నారు. శివరాజ్.. నేను మీకు ఒక సవాల్ విసురుతున్నాను. రండి.. మనం ఓ రేసులో పాల్గొందాం."
- కమల్‌నాథ్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు
"నాకు నిమోనియా ఉన్నందున.. కొవిడ్-19 తర్వాత చికిత్స కోసం దిల్లీ వెళ్లాను. ఇది ఎవరికైనా ఉంటుంది. అన్ని పరీక్షలు పూర్తి అయ్యాయి. నివేదికలన్నీ నాకు అనుకూలంగా వచ్చాయి. కొవిడ్ రెండు రకాలు.. షార్ట్ కొవిడ్.. లాంగ్‌కొవిడ్. నేను లాంగ్ కొవిడ్‌ను ఎదుర్కొన్నాను. అంతమాత్రాన నేను అస్వస్థతతో దిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కాదు. నాకు చాలా బాధ్యతలు(కాంగ్రెస్‌కు సంబంధించి) ఉన్నాయి." అని కమల్‌నాథ్(Kamal Nath news today) పేర్కొన్నారు.
అక్టోబరు 30న మధ్యప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు(madhya pradesh bypoll 2021) జరగనున్నాయి. ఇందుకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను తీసుకుని కమల్‌నాథ్ దిల్లీకి వెళ్లాల్సి ఉందని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.
కమల్‌నాథ్ వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర భాజపా సీనియర్ నేత దీపక్ విజయవర్గీయ.. "భాజపా ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం పోటీ పడుతోంది. కానీ డ్రాయింగ్ రూముల్లో కూర్చొని ట్విట్టర్‌లో కాంగ్రెస్ రేస్‌లు నిర్వహిస్తోంది. ఉపఎన్నికల్లో(madhya pradesh bypoll 2021) ఎవరు విజేతలో ప్రజలే నిర్ణయిస్తారు. కమల్‌నాథ్ ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కరోనాను జయించిన నాథ్ బాగుండాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.
కమల్‌నాథ్, చౌహాన్.. ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. గతేడాది ఆగస్టులో వైరస్ నుంచి చౌహాన్ కోలుకున్నారు.
ఇదీ చూడండి: భవానీపుర్‌లో దీదీ విజయఢంకా- 58 వేల ఓట్ల తేడాతో గెలుపు