ETV Bharat / bharat

బిహార్​ సమరంలో మెరిసిన కామ్రేడ్స్​! - బిహార్​లో ఎన్నిక ల ఫలితాలు

ఎన్నికల్లో ఉనికిని కోల్పోతున్న వామపక్షాలు ప్రస్తుత బిహార్​ ఎన్నికల్లో మెరిశాయి. పోటీ చేసిన 29 స్థానాల్లో 19 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి.

Left parties
బిహార్​ సమరంలో మెరిసిన కామ్రెడ్స్​
author img

By

Published : Nov 10, 2020, 4:08 PM IST

బిహార్‌లో మహాకూటమితో జతకట్టి బరిలోకి దిగిన వామపక్షాలు 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తం 29 స్థానాల్లో వామపక్షాలు పోటీ చేశాయి. మహాకూటమికి నేతృత్వం వహించిన ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ పార్టీ నేతలు వారించినప్పటికీ వామపక్షాలకు 29 సీట్లను కేటాయించారు. ఇది కలిసొచ్చినట్లే కనిపిస్తోంది. సీపీఐ(ఎం) 4, సీపీఐ 6, సీపీఐ (ఎమ్​ఎల్​) 19 సీట్లలో పోటీ చేశాయి.

2010 ఎన్నికల్లో సీపీఐ ఒక్క స్థానంలో గెలుపొందగా, 2015లో సీపీఐ (ఎమ్​ఎల్​) మూడు చోట్ల గెలుపొందింది.

దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వామపక్షాలు ఓటమినే చవిచూశాయి. తమకు పట్టున్న బంగాల్​ సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ తమ ప్రాభవాన్ని కోల్పోయి. ఇలాంటి తరుణంలో బిహార్​లో కామ్రేడ్లు పుంజుకోవడం వామపక్షాలను పునరుత్తేజాన్నిచ్చేలా కనిపిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.