ETV Bharat / bharat

'కరోనాపై నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్రం' - left +parties on central govt

కరోనా కట్టడికి సమాయత్తం అవ్వటంలో కేంద్రం సమయాన్ని వృథా చేస్తోందని వామపక్షాలు మండిపడ్డాయి. వైరస్​ వ్యాప్తిని అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే.. అధికారంలో కొనసాగే నైతికత కోల్పోతుందని స్పష్టం చేశాయి. అందరికీ ఉచిత టీకా ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

left parties
వామపక్షాలు
author img

By

Published : May 1, 2021, 5:12 PM IST

కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయటంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, సమయాన్ని వృథా చేస్తోందని మండిపడ్డాయి. ఈ మేరకు సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్, ఆల్​ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్​, రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలు.. సంయుక్తంగా ప్రకటన చేశాయి.

" స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఎన్నడూ లేని అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని భారత్​ ఎదుర్కుంటోంది. కరోనా కట్టడికి కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని.. ప్రజల ప్రాణాలు కాపాడాలి. ప్రజలకు ఉచితంగా టీకాలు అందించాలి. మన సలహాలు, సూచనలను పట్టించుకోకుండా ఏడాది కాలాన్ని కేంద్రం వృథా చేసింది. వైరస్​ను అదుపు చేయటంలో విఫలమైతే.. ఎన్​డీఏ అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోతుంది."

-- వామపక్షాల సంయుక్త ప్రకటన

'ఆ నిధులు ఖర్చు చేయండి'

అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఇతర ఔషధాలు ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి లెఫ్ట్​ పార్టీలు. బడ్జెట్​లో వైద్య రంగానికి కేటాయించిన రూ. 35వేల కోట్లు వెంటనే ఖర్చు చేయాలన్నాయి. పీఎం కేర్స్ నిధులు, సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు కోసం కేటాయించిన రూ. 20 వేల కోట్లను వ్యాక్సిన్​ కొనుగోలు కోసం ఖర్చు పెట్టాలని వామపక్షాలు సూచించాయి.

ఇదీ చదవండి : 'ప్రాణాలు పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.