ETV Bharat / bharat

'కూటమి' బేజారు- కామ్రేడ్లకు ఇక కష్టమే! - వామపక్షాలు కాంగ్రెస్​ కూటమి

బంగాల్​ దంగల్​లో మహాకూటమి తేలిపోయింది. వామపక్షాలు, కాంగ్రెస్​, ఐఎస్​ఎఫ్​తో కూడిన కూటమి... టీఎంసీ-భాజపా మధ్య పోరులో నిలవలేకపోయింది. గతంలో సాధించిన స్థానాలు కూడా దక్కించుకోలేకపోయింది. ఫలితంగా ఆయా పార్టీల ఉనికి మరింత ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో వాటి భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకంగా మారింది.

Left and congress looses yet another election battle in Bengal
మళ్లీ భంగపాటు- బంగాల్​లో కూటమి పరిస్థితేంటి?
author img

By

Published : May 2, 2021, 6:30 PM IST

బంగాల్​లో వామపక్ష కూటమికి మరోమారు భంగపాటు తప్పలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి(వామపక్షాలు-కాంగ్రెస్​-ఐఎస్​ఎఫ్​) అసలు ప్రభావం చూపలేకపోయాయి. టీఎంసీ-భాజపా మధ్య జరుగుతున్న యుద్ధంలో కింగ్​ మేకర్​గా అవతరిస్తామనుకున్న కూటమి నేతలకు తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే దారుణంగా ఉన్న ఆయా పార్టీల పరిస్థితి.. ఈ ఎన్నికలతో మరింత ప్రమాదంలో పడింది.

ప్రభావం శూన్యం...!

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. ముస్లిం మతపెద్ద అబ్బాస్‌ సిద్ధిఖి స్థాపించిన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌)తో జతకట్టి 'సంయుక్త మోర్చా' పేరుతో మూకుమ్మడిగా బరిలోకి దిగాయి. నేరుగా పదవిలోకి రాలేకున్నా.. ఈసారి ఎన్నికల్లో తాము కింగ్‌ మేకర్‌ అయ్యే అవకాశాలున్నాయని ఈ కూటమి నేతలు అంచనా వేశారు. తృణమూల్‌ కాంగ్రెస్, భాజపాకు మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడితే.. తాము నిర్ణయాత్మకంగా మారుతామని లెక్కలు వేసుకున్నారు.

ఇదీ చూడండి:- 'కరోనా యోధులపై పని భారం తగ్గించేదెలా?'

294 నియోజకవర్గాలున్న బంగాల్​లో ఈసారి వామపక్షాలు 177 స్థానాల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్​ 91, ఐఎస్​ఎఫ్ 26 స్థానాల్లో బరిలోకి దిగాయి. కానీ ఆయా పార్టీలు ఘోర పరాభవాన్ని చవిచూశాయి.

కారణాలేంటి?

ఆనాడు పూలు అమ్ముకున్న చోటే.. వామపక్షాలు నేడు కట్టలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సిద్ధాంతాల్లో లోపాలు పార్టీని కుదిపేస్తోంది. సరైన నాయకత్వం కూడా లేకపోవడం మరింత చేటుచేస్తోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఓటమిలో కాంగ్రెస్​ పాత్ర కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. బంగాల్​లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం, కేరళలో అదే వామపక్షాలకు వ్యతిరేకంగా పోటీ చేయడం వంటి అంశాలు.. హస్తం పార్టీని తిప్పలు పెట్టాయని అంటున్నారు. దీని వల్లే కాంగ్రెస్​ పెద్దలు బంగాల్​లో సరైన విధంగా ప్రచారాలు కూడా నిర్వహించలేదని చెబుతున్నారు.

మరోవైపు సిద్ధిఖీపై వామపక్షాలు, కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకున్నా... గతంలో వేర్వేరు వర్గాలు, రాజకీయ పార్టీలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమికి ప్రతికూలంగా మారాయన్నది నిపుణుల మాట.

2016లో గెలుపొందిన స్థానాలను కాపాడుకోవడంలోనూ మహాకూటమి విఫలమైంది. అదే సమయంలో రాష్ట్రంలో భాజపా పట్టు పెరగడం.. ఆయా పార్టీల ఉనికిని మరింత ప్రమాదంలోకి నెట్టే విషయం.

ఇదీ చూడండి:- ఆంక్షలు బేఖాతరు- సంబరాల్లో పార్టీ శ్రేణులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.