సైనిక బలగాలకు సంబంధించిన అధికారిక రహస్యాలను బహిర్గతం చేయడం దేశ ద్రోహం కిందకు వస్తుందని కాంగ్రెస్ నేత ఏకే ఆంటోని అన్నారు. ఇందులో చేతులు కలిపినవారికి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు. ఈ మేరకు విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి చేసిన వాట్సాప్ చాట్లను గురించి కూడా ప్రస్తావించారు. 2019 వైమానిక దాడులకు సంబంధించిన సమాచారం లీక్ అవడంపై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంటోని. జాతీయ భద్రతకు భంగం కలిగించే ఈ అంశంలో దోషులెవరినీ వదిలిపెట్టకూడదన్నారు.
2019 ఫిబ్రవరి 26న భారత్‌కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రస్థావరంపై దాడి చేసి.. దాయాది దేశానికి తీవ్ర హెచ్చరికలు జారీచేశాయి.
ఇదీ చదవండి: 'ఆ ఛానల్ రేటింగ్ పెంచేందుకు కుట్ర!'