కేరళలో నాలుగు దశాబ్దాల సంప్రదాయానికి కళ్లెం వేసి.. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో రెండోసారి గెలిచిన వామపక్ష కూటమి నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా మరో 21 మంత్రులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. పినరయితో ప్రమాణం చేయించనున్నారు.
జేడీ-ఎస్, ఎన్సీపీకి చెందిన ఇద్దరు తప్ప.. బాధ్యతలు చేపట్టబోయే మంత్రులంతా కొత్త వారే. ముగ్గురు మహిళలు విజయన్ కేబినెట్‌లో చేరనున్నారు. విజయన్ మేనల్లుడు పీఏ.మహమ్మద్ రియాజ్ కూడా మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కేరళ శాసనసభ చరిత్రలో మామ, అల్లుడు మంత్రివర్గంలో ఉండడం ఇదే తొలిసారి.
హైకోర్టు అనుమతి..
రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా.. కేవలం కొద్ది మంది సమక్షంలోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని కేరళ హైకోర్టు అదేశించింది.