ETV Bharat / bharat

లా స్టూడెంట్​ దారుణ హత్య- రాడ్లతో కొట్టి, 14 సార్లు కత్తులతో పొడిచి.. - Debt-ridden man commits suicide

Law student killed: 24 ఏళ్ల న్యాయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు కొందరు దుండగులు. విద్యార్థి స్నేహితుడు తప్పించుకున్నా.. రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హరియాణా ఫరీదాబాద్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. షేర్​మార్కెట్​లో నష్టంతో.. తల్లిని చంపి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పుణెలో జరిగింది.

Law student killed in Faridabad;
Law student killed in Faridabad;
author img

By

Published : Jan 2, 2022, 6:14 PM IST

Law student killed: హరియాణా ఫరీదాబాద్​లోని సాగర్​పుర్​లో శనివారం రాత్రి దారుణ ఘటన జరిగింది. 24 ఏళ్ల లా విద్యార్థిని దుండగులు ఐరన్​ రాడ్లతో కొట్టి.. కత్తులతో పొడిచి చంపారు. మృతుడు రాహుల్​ శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

రెండేళ్ల కిందటి శత్రుత్వమే ఈ హత్యకు కారణమని.. బాధితుడి తండ్రి ధర్మరాజ్​ చెప్పారు. రాహుల్​, అతడి స్నేహితుడు రింకు ఇంటికి తిరిగివస్తుండగా.. దుండగులు దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐరన్​ రాడ్లతో, పదునైన కత్తులతో విరుచుకుపడినట్లు పోలీసులకు వివరించారు.

''రాహుల్​ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. తీవ్రగాయాలతో బయటపడ్డ రింకు మాత్రం.. రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.''

- ధర్మరాజ్​, రాహుల్​ తండ్రి

ధర్మరాజ్​ ఫిర్యాదు మేరకు.. నిందితులు హరి ఓం, సాగర్​, అమన్​, ఆశిష్​ సహా పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని.. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

షేర్​మార్కెట్​లో నష్టం- తల్లిని చంపి తానూ..

Debt-ridden man commits suicide: మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధ కారణంగా.. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు 42 ఏళ్ల వ్యక్తి గణేశ్​.

'షేర్​మార్కెట్​లో భారీ నష్టం చవిచూశానని.. అందుకే ఈ పనిచేస్తున్నా' అని గణేశ్​ తన బంధువుకు వాట్సాప్​లో సూసైడ్​ నోట్​ పంపినట్లు పోలీసులు తెలిపారు. ధనక్​వాడీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

తన తల్లికి అధిక మోతాదులో మెడిసిన్​ ఇచ్చినా చనిపోలేదు. అనంతరం.. ప్లాస్టిక్​ బ్యాగ్​ మొహానికి చుట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ వ్యక్తి కూడా ఉరి వేసుకొని చనిపోయాడు.

సోదరుడి మరణాన్ని తట్టుకోలేక..

Distressed man hangs self: తన అన్న మరణించాడన్న బాధను దిగమింగుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్​ శహ్​డోల్​లో జరిగింది. చెట్టుకు ఉరివేసుకొని ఉన్న బాధితుడి మృతదేహాన్ని శనివారం రాత్రి గుర్తించారు పోలీసులు.

మృతుడు శివేంద్ర మిశ్రా(22) సోదరుడు ఉపేంద్ర మిశ్రా(27) డిసెంబర్​ 31న నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అతడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆ బాధలో తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి: పది రూపాయల కోడిపిల్లకు రూ.50 టికెట్​- ఆర్టీసీ కండక్టర్​ ఘనకార్యం!

పాక్ 'బ్యాట్'​ కుట్ర భగ్నం​-​ చొరబాటుదారుడు హతం

హనీమూన్ కోసం వెళ్లి.. తొక్కిసలాటలో వైద్యుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.