దేశంలో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. కొత్తగా 2,61,500 మందికి వైరస్ సోకింది. మరో 1,501 మంది చనిపోయారు. 1,38,423 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- మొత్తం కేసులు: 1,47,88,109
- మొత్తం మరణాలు: 1,77,150
- మొత్తం కోలుకున్నవారు: 1,28,09,643
- యాక్టివ్ కేసులు: 18,01,316
దేశంలో మొత్తంగా 12 కోట్ల 26 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా శుక్రవారం ఒక్కరోజే 15,66,394 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్ టెస్ట్‌ల సంఖ్య 26 కోట్ల 65 లక్షలు దాటింది.
ఇదీ చదవండి: టీకాతో ఇన్ఫెక్షన్ ఆగదు..!
ఇదీ చదవండి: రెమ్‌డెసివిర్ మంత్రదండం కాదు: గులేరియా