తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన చైనాకు భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చిందని సైన్యాధిపతి ఎమ్ఎమ్ నరవాణే అన్నారు. సైన్యం చేతిలో దేశం సురక్షితంగా, భద్రంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా దిల్లీ కరియప్ప మైదానంలో జరిగిన పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు.
"సరిహద్దులో చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన గురించి అందరికీ తెలుసు. సరిహద్దు వద్ద యుథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన చైనా తగిన మూల్యం చెల్లించుకుంది. గల్వాన్ అమరవీరుల త్యాగాన్ని వృథా కానివ్వబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను.
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అలా అని మా సహనాన్ని పరీక్షించే తప్పు చేయొద్దు.
భారత్‌లోకి చొరబడేందుకు పాకిస్థాన్ సరిహద్దు వద్ద 300-400 మంది ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే కాల్పుల విరమణ ఘటనలు 44 శాతం పెరిగాయి. దీన్ని బట్టి పాకిస్థాన్ కుటిల బుద్ధి అర్థం అవుతోంది. గత ఏడాది నియంత్రణ రేఖ వద్ద 200 మందికి పైగా ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది."
- ఎమ్ఎమ్ నరవాణే, భారత సైన్యాధిపతి
ఆధునీకరణ..
సైన్యాన్ని ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నట్లు నరవాణే అన్నారు. ఇందుకోసం అత్యవసరంగా రూ. 5 వేల కోట్లు విలువైన ఆయుధాల కోసం ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. గత ఏడాది రూ.13 వేల కోట్ల విలువైన పరికరాల కోసం సంతకాలు చేశామని సైన్యాధిపతి అన్నారు.
ఆర్మీ దినోత్సవం సందర్భంగా తొలిసారి కాంబాట్ స్వార్మ్ డ్రోన్లను ప్రదర్శన చేసింది సైన్యం. వీటితో పాటు పలు యుద్ధ ట్యాంకులు, ఆధునిక పరికరాలను పరేడ్‌లో ఉంచారు.
-
#WATCH | For the first time ever, Indian Army demonstrates combat swarm drones at #ArmyDay parade 2021 in Delhi. pic.twitter.com/F12rfo4emN
— ANI (@ANI) January 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | For the first time ever, Indian Army demonstrates combat swarm drones at #ArmyDay parade 2021 in Delhi. pic.twitter.com/F12rfo4emN
— ANI (@ANI) January 15, 2021#WATCH | For the first time ever, Indian Army demonstrates combat swarm drones at #ArmyDay parade 2021 in Delhi. pic.twitter.com/F12rfo4emN
— ANI (@ANI) January 15, 2021