ETV Bharat / bharat

యోగికి ఉగ్రవాదుల హెచ్చరిక.. '46 రైల్వే స్టేషన్లలో బాంబు పేలుళ్లు'!

author img

By

Published : Nov 1, 2021, 1:08 PM IST

46 రైల్వే స్టేషన్లలో బాంబు దాడులు చేస్తామని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar-E-Taiba Latest News) హెచ్చరించింది. అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.

uttarpradesh news latest
ఉగ్రవాదుల హెచ్చరిక

రాష్ట్రంలోని 46 రైల్వే స్టేషన్లపై బాంబు దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar-E-Taiba Latest News) ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు అధికారులకు లేఖ అందింది. ఈ జాబితాలో రాజధాని లఖ్​నవూ సహా ప్రధాన పట్టణాలైన వారణాసి తదితర స్టేషన్లు ఉన్నాయి. దీపావళి పండగ నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి (Lashkar-E-Taiba Latest News) ఈ లేఖ అందడం యూపీ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాద సంస్థకు చెందిన స్థానిక కమాండర్​ ఈ లేఖను పంపించినట్లు తెలుస్తోంది.

లష్కరే తోయిబా (Lashkar-E-Taiba Latest News) నుంచి వచ్చిన ఈ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు.. రైల్వే శాఖ సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. లఖ్​నవూలోని ఛార్​బాఘ్​ రైల్వే స్టేషన్​ సహా లఖ్​నవూ జంక్షన్​లో జీఆర్​పీ, ఆర్​పీఎఫ్​ బృందాలు నిఘాను కట్టుదిట్టం చేశాయి. రైళ్లలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాత్రిపూట రాకపోకలు జరిపే రైళ్లపైన ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు.

ఈ తరహా బెదిరింపులు రావడం తొలిసారి కాదని.. ఇది వరకు కూడా ఇలా రైల్వే స్టేషన్లపై బాంబు దాడులు చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయన్నారు అధికారులు. 2018లోనూ లష్కరే తోయిబా ఇటువంటి బెదిరింపులకే పాల్పడిందని గుర్తు చేశారు.

ఇదీ చూడండి : 'ధరలు పెరిగితే ఏంటి?.. ప్రజలు బాగానే సంపాదిస్తున్నారు కదా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.