ETV Bharat / bharat

స్కూల్​ను గోదాముగా మార్చిన లిక్కర్​ మాఫియా.. భారీగా విదేశీ మద్యం పట్టివేత - బిహార్​ వార్తలు

విదేశీ మద్యం సీసాలను నిల్వ ఉంచేందుకు గ్రామంలో ఉన్న హైస్కూల్​నే గోదాముగా మార్చింది ఓ లిక్కర్​ మాఫియా. విషయం తెలుసుకున్న పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

large-consignment-of-liquor-recovered-from-school-in-vaishali nihar

author img

By

Published : Sep 21, 2022, 10:27 PM IST

Updated : Sep 21, 2022, 10:43 PM IST

బిహార్​లోని వైశాలి జిల్లాలో ఉన్న ఓ ఉన్నత పాఠశాలను మద్యం సీసాలను నిల్వ ఉంచే గోదాముగా మార్చింది లిక్కర్​ మాఫియా. సమచారం అందుకున్న పోలీసులు.. వెంటనే స్కూల్​కు చేరుకుని ఓ గదిలో ఉన్న 140 బాక్సుల విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని లాల్​గంజ్​ పోలీస్​స్టేషన్​ పరిధికి చెందిన బృందావన్​​ గ్రామంలో ఉన్న రామరాతి ఉన్నత పాఠశాలలోని ఓ గదిలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ మద్యాన్ని నిల్వ ఉంచింది లిక్కర్​ మాఫియా. అందుకోసం ఆ గదికి పాఠశాల యాజమాన్యం వేసిన తాళాన్ని పగలగొట్టి తమ కొత్త తాళాన్ని వేశారు స్మగ్లర్లు. అయితే హైస్కూల్​ ఉపాధ్యాయుడు ఆదేశ్​పాల్​.. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చాక ఆ గదిని తెరవడానికి వెళ్లగా.. కొత్త తాళం ఉండటాన్ని గమనించారు.

వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయడికి సమాచారం అందించారు. అనంతరం లాల్​గంజ్​ పోలీసులకు విషయాన్ని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని తాళం పగలగొట్టి చూడగా గదిలో భారీగా మద్యం నిల్వ ఉంది. దీంతో వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని వ్యాన్​లో స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవీ చదవండి:'భాజపాను గద్దె దించుతాం.. వారికి తలవంచే ప్రసక్తే లేదు'.. లాలూ ఫైర్

లాకప్​లో ఖైదీ మృతి.. లైవ్​లో కుప్పకూలిన స్మగ్లర్.. స్టేషన్​పై గ్రామస్థుల దాడి

Last Updated : Sep 21, 2022, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.