ETV Bharat / bharat

మెడికోతో లవ్ ఫెయిల్.. కక్షతో ల్యాప్​టాప్స్​ చోరీ.. ప్రతి కాలేజీకి టైమ్​టేబుల్ వేసి మరీ... - chennai laptop thief arrested

అతడో భగ్నప్రేమికుడు. వైద్యవిద్యార్థిని ప్రేమించి, పెళ్లాడదామని అనుకున్న అతడికి.. చివరకు తీవ్ర నిరాశే మిగిలింది. అందుకే దేశంలోని మెడికల్ స్టూడెంట్స్ అందరిపై కక్ష పెంచుకున్నాడు. వారి ల్యాప్​టాప్స్​ కాజేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఏ రోజు ఏ కళాశాలకు వెళ్లాలో టైమ్​టేబుల్​ వేసుకుని మరీ.. చోరీల పరంపరం కొనసాగించాడు. చివరకు చెన్నై పోలీసులకు చిక్కాడు.

laptop thief arrested
మెడికోతో లవ్ ఫెయిల్.. కక్షతో ల్యాప్​టాప్స్​ చోరీ.. ప్రతి కాలేజీకి టైమ్​టేబుల్ వేసి మరీ...
author img

By

Published : Apr 11, 2022, 2:06 PM IST

Chennai laptop thief arrested: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో విద్యార్థుల ల్యాప్​టాప్స్​ చోరీ చేస్తున్న యువకుడ్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అతడు రోజూ 2 ల్యాప్​టాప్​లు కాజేస్తున్నాడని గుర్తించారు. నిందితుడి ఇంటి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ యువకుడు చెప్పిన విషయాలు విని.. పోలీసులంతా ఖంగుతిన్నారు.

ఒక్క ఫిర్యాదుతో..: రుద్రేశ్​.. చెన్నైలోని స్టాన్లీ వైద్య కళాశాల విద్యార్థి. కొద్దిరోజుల క్రితం కాలేజీలో అతడి ల్యాప్​టాప్ కనిపించకుండా పోయింది. వన్నారపెట్టై పోలీస్ స్టేషన్​లో రుద్రేశ్​ చోరీ కేసు పెట్టాడు. కాలేజీ సీసీటీవీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. ఓ కళాశాలతో సంబంధం లేని వ్యక్తి లోపల తిరుగుతున్నట్లు గుర్తించారు. అతడే ల్యాప్​టాప్​లు దొంగిలిస్తున్నాడని ప్రాథమికంగా నిర్ధరించారు. వెంటనే ఇన్​స్పెక్టర్​ యమున నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. కాలేజీలో మోహరించారు.

శనివారం పోలీసులు స్టాన్లీ ఆస్పత్రి పరిసరాల్లో గస్తీ కాస్తున్నారు. అదే సమయానికి అక్కడికి ఓ యువకుడు వచ్చాడు. సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది అతడేనని నిర్ధరించుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి ప్రశ్నించారు. నిందితుడిని తిరువారూర్​కు చెందిన తమిళ్​సెల్వన్​(25)గా గుర్తించారు. ల్యాప్​టాప్​ల దొంగతనం అతడి పనేనని నిర్ధరించుకున్న పోలీసులు.. విచారణలో సెల్వన్ చెప్పిన సంగతులు విని షాక్ అయ్యారు.

ప్రేమ.. కక్ష.. చోరీ..: పోలీసుల కథనం ప్రకారం.. తమిళ్​సెల్వన్ దూరవిద్యలో ఇప్పటికే న్యాయశాస్త్రం చదివాడు. యూనివర్సిటీ ఆఫ్​ దిల్లీలో బీఏ(ఎకనామిక్స్​) చదువుతున్నాడు. కొన్నేళ్లుగా ఓ వైద్య విద్యార్థిని ప్రేమించాడు. అయితే ఆ లవ్ స్టోరీ ఫెయిలైంది. అందుకే వైద్య విద్యార్థులు అందరిపైనా సెల్వన్​ పగ పట్టాడు. దేశంలోని ప్రతి మెడికల్ కాలేజీపైనా గురిపెట్టాడు. ఏ రోజు కళాశాలకు వెళ్లాలో ముందే ఓ 'టైమ్​ టేబుల్​' వేసుకున్నాడు. తన అవతారాన్ని మార్చుతూ, రోజూ ఓ కాలేజీకి వెళ్తూ.. నిత్యం సగటున రెండు ల్యాప్​టాప్​లు చోరీ చేస్తున్నాడు. వాటిని ఓ ఆన్​లైన్​ వెబ్​సైట్​ ద్వారా విక్రయిస్తున్నాడు. విచారణ తర్వాత చెమ్మన్​చేరిలోని సెల్వన్​ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అప్పటికే చోరీ చేసి, విక్రయించడానికి సిద్ధంగా ఉంచని 31 ల్యాప్​టాప్​లను స్వాధీనం చేసుకున్నారు. ఏ రోజు ఏ కాలేజీకి వెళ్లాలని విషయాన్ని ఇంట్లో ఉన్న క్యాలెండర్​లో రాసిపెట్టుకున్నాడని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.