ETV Bharat / bharat

గొలుసులతో బంధించి కూలీలతో వెట్టిచాకిరి.. రోజుకు ఒకపూటే భోజనం.. బావిలోనే మలమూత్రవిసర్జన

కూలీల పట్ల దారుణంగా ప్రవర్తించారు ఇద్దరు కాంట్రాక్టర్లు. సరిగ్గా భోజనం పెట్టకుండా వారితో రోజుకు 12 గంటలు వెట్టిచాకిరి చేయించుకున్నారు. రాత్రి సమయంలో ఎక్కడికీ వెళ్లిపోకుండా బావుల్లో కూలీలను గొలుసులతో బంధించారు. మలమూత్ర విసర్జన కూడా.. వారు తవ్వే బావిలోనే చేయించారు.

author img

By

Published : Jun 20, 2023, 2:25 PM IST

Updated : Jun 20, 2023, 2:33 PM IST

labourers tied with chains
labourers tied with chains

మహారాష్ట్ర ఉస్మానాబాద్​లో అమానవీయ ఘటన జరిగింది. బావులు తవ్వడం కోసం వెళ్లిన కూలీల పట్ల దారుణంగా ప్రవర్తించారు కాంట్రాక్టర్లు. రాత్రి సమయంలో కూలీలు ఎక్కడికీ వెళ్లిపోకుండా వారిని గొలుసులతో బంధించారు. అంతే కాకుండా వారికి రోజుకు ఒకసారి మాత్రమే భోజనం పెట్టేవారు. మలమూత్ర విసర్జన కూడా వారు తవ్వే బావిలోనే చేయమనేవారు. ఆ మలాన్ని మళ్లీ బకెట్​లకు ఎత్తించి బయటకు పోయించేవారు. ఇంతలా నరకం అనుభవించిన కూలీలు నిందితుల చెర నుంచి ఎలా బయటపడ్డారంటే?

హింగోలీకి చెందిన 12 మంది.. బావులు తవ్వేందుకు సంతోశ్ జాదవ్​, కృష్ణ శిందే అనే కాంట్రాక్టర్ల వద్ద కూలీలుగా చేరారు. వీరితో రోజుకు 12 గంటలు చొప్పున గొడ్డు చాకిరి చేయించుకునేవారు ఇద్దరు కాంట్రాక్టర్లు​. సరైన భోజనం కూడా పెట్టేవారు కాదు.. అంతే కాకుండా ఒక్క రూపాయి కూలీ కూడా ఇవ్వలేదు. వీరిని బంధీలుగా ఉంచి బావులు తవ్వించేవారు. అయితే ఈ కూలీల్లో ఒకరు తప్పించుకుని హింగోలీలోని తన స్వగ్రామానికి చేరుకున్నాడు. స్థానిక పోలీసులకు జరిగిందంతా చెప్పాడు. దీంతో పోలీసులు దాడులు నిర్వహించి.. 11 మంది కూలీలను బావుల నుంచి బయటకు తీశారు. అనంతరం వారిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇద్దరు కాంట్రాక్టర్లు సహా నలుగురిని అరెస్ట్ చేశారు. అలాగే కూలీలను చిత్రహింసలకు గురిచేసే మరికొంత కాంట్రాక్టర్ల గురించి సమాచారం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై వ్యక్తుల అక్రమ రవాణా, నిర్భందించడం వంటి పలు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

"ఉస్మానాబాద్‌లోని ఖమాస్‌వాడి, వాఖర్‌వాడి గ్రామాల్లో బావుల తవ్వకాల కోసం 3 నెలల క్రితం కొందరు కూలీలను ఇద్దరు కాంట్రాక్టర్లు రప్పించారు. కూలీలను రాత్రి సమయంలో గొలుసులతో బంధించారు. కూలీల్లో ఒకరు తప్పించుకుని హింగోలిలోని తన స్వస్థలానికి చేరుకున్నాడు. కూలీపై జరుగుతున్న ఆకృత్యాలను స్థానిక పోలీసులకు తెలియజేశాడు. హింగోలీ పోలీసులు, ఒస్మానాబాద్​ పోలీసులు బృందంగా ఏర్పడి ఇద్దరు కాంట్రాక్టర్లు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాఖర్‌వాడి గ్రామంలో ఐదుగురు కూలీలను, ఖమాస్​వాడిలో మరో ఆరుగురిని.. నిందితుల చెర నుంచి కాపాడాం."

--జగదీశ్​ రౌత్​, ఉస్మానాబాద్ ఏఎస్​ఐ

36 ఏళ్లుగా ఇంట్లోనే బందీ..
కొన్నాళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ల్​ని ఫిరోజాబాద్​ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నకూతురు పట్ల తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. 36 ఏళ్ల పాటు కుమార్తెను ఇంట్లోనే బందీ చేశాడు. 17 ఏళ్ల వయస్సులో ఆమెను ఓ గదిలో పెట్టి.. గొలుసుతో కట్టేశాడు. అప్పటి నుంచి ఆమె అందులోనే ఉండిపోయింది. ఎండ, వాన, వెలుగు ఇలాంటివేవీ ఆమెకు తెలియదు. అయితే ఇటీవల ఈ విషయం బయటకు తెలియడం వల్ల ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళా బృందం ఆమెకు విముక్తి కలిగించింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Jun 20, 2023, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.