ETV Bharat / bharat

'కుంభమేళా భక్తులను వెనక్కి పంపండి' - కుంభమేళాపై సుప్రీంలో పిటీషన్​ దాఖలు

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో కుంభమేళాలో పాల్గొంటున్న భక్తలు వెళ్లిపోయేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్​ దాఖలైంది. కుంభమేళాతో పాటు.. ఎన్నికల ర్యాలీల్లో లక్షల మంది గుంపులుగా ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు సంజయ్​ పాఠక్​ అనే వ్యక్తి.

Kumbh Mela
కుంభమేళా
author img

By

Published : Apr 18, 2021, 5:27 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో నిర్వహిస్తోన్న కుంభమేళాకు తరలివచ్చిన జన సమూహాలను తిరిగి వెళ్లిపోయేలా ఆదేశాలు జారీచేయాలంటూ నోయిడాకు చెందిన సంజయ్ కుమార్ పాఠక్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

దేశంలో కరోనా విజృంభణ గురించి ప్రస్తావించిన ఈ పిటిషన్.. కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రజలను ఆహ్వానిస్తోన్న ప్రకటనలను తక్షణమే ఉపసంహరించుకునేలా కేంద్రంతో పాటు, ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్​ కోరారు. మరోవైపు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా మార్గదర్శకాలను సక్రమంగా అమలయ్యేలా ఎన్నికల సంఘానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి: కుంభమేళాపై అఖాడాల దారెటు- ముందుగానే ముగిస్తారా?

'కుంభమేళా'పై జునా అఖాడా కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.