హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో కరోనా కేసులు వెలుగుచూస్తున్న వేళ ముంబయి మేయర్ కిశోరీ పెడ్నేకర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కుంభమేళా భక్తులు కరోనా వైరస్‌ను ప్రసాదంలా అందరికి పంచుతారని అన్నారు. ఈ భక్తులను భాజపా ప్రేరేపిస్తోందని ఆరోపించారు.
కరోనా మరింత వ్యాపించకుండా నివారించేందుకు కుంభమేళా భక్తులను క్వారంటైన్‌కు పంపిస్తామని మేయర్ పెడ్నేకర్ వెల్లడించారు. క్వారంటైన్ ఖర్చులను భక్తులే భరించాలని స్పష్టం చేశారు.
ముంబయిలో కరోనా వ్యాప్తి పెరుగుతోందని, అయినప్పటికీ ప్రజలు సమూహాలుగా ఏర్పడటం తగ్గలేదని అన్నారు పెడ్నేకర్. "నగరంలో పడకల సంఖ్యను 19 వేల నుంచి 25 వేలకు పెంచాం. 6 జంబో సెంటర్లను ఏర్పాటు చేశాం. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఈ వసతులు సరిపోవడం లేదు. కాబట్టి ప్రజలు బయటకు వెళ్లొద్దు. లాక్డౌన్ కావాలో వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలి" అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి'