కర్ణాటక మైసూర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. నరసింహరాజ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఉమెన్స్ హాస్టల్లోని ఓ గదిలో.. 23ఏళ్ల మహిళ ఒంటరిగా ఉండటాన్ని అక్కడే పనిచేసే ఓ డ్రైవర్ గమినించాడు. వెంటనే మహిళ గదిలోకి వెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆ మహిళ ప్రతిఘటించటం వల్ల కత్తితో ఆమెను గాయపరిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు.
బాధితురాలి రూంమేట్స్ వచ్చి.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
విచారణలో బాధితురాలికి, నిందితుడికి ఒకరికొకరు ఇదివరకే పరిచయం ఉన్నట్లు తేలిందని మైసూరు కమిషనర్ చంద్రగుప్తా వెల్లడించారు.
ఇదీ చదవండి: బ్లడ్ బ్యాంకు నిర్లక్ష్యం.. 8 నెలల చిన్నారికి హెచ్ఐవీ