ETV Bharat / bharat

లౌడ్​స్పీకర్ల వినియోగంపై వక్ఫ్​ బోర్డు ఆంక్షలు

author img

By

Published : Mar 17, 2021, 11:33 AM IST

లౌడ్​ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక వక్ఫ్ బోర్డు ఆంక్షలు విధించింది. దర్గాల్లో, మసీదుల్లో లౌడ్​ స్పీకర్లను రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య వినియోగించకూడదని స్పష్టం చేస్తూ ఈనెల 9న ఉత్తర్వులు​ జారీ చేసింది.

karnataka
లౌడ్​స్పీకర్ల వినియోగంపై కర్ణాటక వక్ఫ్​ బోర్డు ఆంక్షలు

మసీదు, దర్గాల్లో లౌడ్​ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక వక్ఫ్ బోర్డు ఆంక్షలు విధించింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి స్పీకర్లను వినియోగించరాదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ ఈనెల 9న ఉత్తర్వులు​ జారీ చేసింది.

"మసీదులు, దర్గాల్లో వినియోగించే లౌడ్​ స్పీకర్ల కారణంగా సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని గుర్తించాము. ఈ విషయంపై 2017 జులై 10న తొలిసారి ప్రకటన విడుదల చేశాము. ఆజాన్​కు మాత్రమే లౌడ్​స్పీకర్ల వినియోగానికి అనుమతిస్తున్నాము."

-కర్ణాటక వక్ఫ్​ బోర్డు

నిర్ణయాన్ని సమీక్షించాలి..

ఈ ఉత్తర్వులపై బెంగళూరులోని జామియా మసీద్​ ఇమామ్​ మఖ్​సూద్​ ఇమ్రాన్ స్పందించారు. నిర్ణయాన్ని సమీక్షించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. త్వరలో రంజాన్​ రానున్న నేపథ్యంలో సూర్యోదయం వేళలను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలను ఉదయం ఐదు గంటల వరకే పరిమితం చేయాలని కోరినట్లు తెలిపారు.

ఇదీ చదవండి : 'ఓటర్లలో ఉదాసీనతకు జమిలి ఎన్నికలతో చెక్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.