ETV Bharat / bharat

Kozhikode plane crash: కోజికోడ్​ విమాన ప్రమాదానికి కారణం అదే! - రన్​వేపై క్రాష్​ ల్యాండింగ్​

కేరళలోని కోజికోడ్​ విమానాశ్రయంలో 2020, ఆగస్టులో జరిగిన విమాన ప్రమాదంపై నివేదిక(kozhikode plane crash report) విడుదల చేసింది దర్యాప్తు సంస్థ ఏఏఐబీ. ఆపరేటింగ్​ నిబంధనలను పైలట్లు పాటించకపోవటం వల్ల ప్రమాదం(kozhikode plane crash) జరిగి ఉండొచ్చని పేర్కొంది.

Kozhikode plane crash
విమాన ప్రమాదంపై నివేది
author img

By

Published : Sep 11, 2021, 10:37 PM IST

గత ఏడాది కేరళలోని కోజికోడ్​ విమానాశ్రయంలో ఎయిర్​ఇండియా విమాన ప్రమాదంపై నివేదిక(kozhikode plane crash report) విడుదల చేసింది ఎయిర్​క్రాఫ్ట్​ యాక్సిడెంట్​ ఇన్వెస్టిగేషన్​ బ్యూరో(ఏఏఐబీ). ఆపరేటింగ్​ నిబంధనలను పైలట్లు పాటించకపోడమే విమానం కూలిపోవడానికి(plane crash) కారణం కావొచ్చని, అయితే.. ప్రమాదంలో వ్యవస్థాగత వైఫల్యాలను విస్మరించలేమని పేర్కొంది.

"పైలట్లు నిబంధనలు పాటించకపోవటమే ప్రమాదానికి కారణం కావొచ్చు. పైలట్లు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవటం, రన్​వేపై ల్యాండింగ్​ జోన్​లో కాకుండా పక్కకు ల్యాండ్​ చేయటం సహా.. ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​ 'గో అరౌండ్​' కాల్​ ఇచ్చినా.. ఆ సిగ్నల్స్​ను అందుకోవటంలో విఫలమవటం వల్ల క్రాస్​ ల్యాండింగ్​ అయి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయి. ఇందుకు విమానయాన రంగంలోని వ్యవస్థాగత వైఫల్యాలు కూడా ఒక కారణమే. వ్యవస్థలో పని చేసే వ్యక్తులు చేసే తప్పులు, లోపాలు, ఉల్లంఘనలతో భద్రతా వ్యవస్థలో వైఫల్యాలు ఏర్పడి ఈ ప్రమాదాలు జరుగుతాయి."

-నివేదిక

కోజికోడ్​ విమాన ప్రమాదంపై(kozhikode plane crash) నివేదికను బహిరంగపరుస్తామని రెండు రోజుల క్రితమే పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అలాగే.. బాధిత కుటుంబాలకు పరిహారం అందించటం పూర్తయినట్లు లోక్​సభలో తెలిపారు విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్​. 165 మందిలో 73 మంది పరిహారం తీసుకునేందుకు అంగీకరించగా.. రూ.60.35 కోట్లు అందించినట్లు చెప్పారు.

ప్రమాదంలో 21 మంది మృతి..

2020, ఆగస్టు 7న వందేభారత్​ మిషన్​లో భాగంగా దుబాయ్​ నుంచి కోజికోడ్​కు చేరిన ఎయిర్​ ఇండియా బోయింగ్​ 737-800 విమానం.. రన్​వేపై ల్యాండ్​ అవుతుండగా అదుపుతప్పింది. సమీపంలోని లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాద సమయంలో విమానంలో 190 మంది ఉన్నారు.

ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాదం- ఆ నలుగురూ సేఫ్​

రెండు సార్లు ప్రయత్నించినా.. ప్రమాదం తప్పలేదు

విమాన ప్రమాద ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.