Korutla Young Woman Murder Case Viral Audio : జగిత్యాల జిల్లా కోరుట్ల సాప్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత ఓ యువకుడితో వెళ్లిపోయిన దీప్తి సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. తాను అక్కను చంపలేదంటూ.. తన సోదరుడు సాయికి చందన ఆ వాయిస్ మెసేజ్ పంపినట్లుగా ఉన్న ఒక ఆడియో వైరల్(Audio Viral)గా మారింది. 'నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాను.. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నా.. కానీ అప్పటికే అక్క సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయాను.. అంతే తప్ప నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు. నన్ను నమ్ము సాయి. నా తప్పేం లేదు.. ప్లీజ్ నమ్మురా' అంటూ ఆడియోలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
Chandana Audio Leak in Jagtial : మరోవైపు మృతురాలు దీప్తి ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనితో దీనిని హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. దీనికి తోడు కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటమే కాకుండా ఇంట్లోని రూ.కోటి విలువ గల బంగారం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మృతురాలు దీప్తి(Deepthi) సోదరి చందన దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాళ్లు నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో చందన ఆచూకీ కోసం రెండు బృందాలను పోలీసులు రంగంలోకి దించారు. మరోవైపు చందనతో ఉన్న యువకుడు ఎవరు? అనే దానిపైనా ఆరా తీస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. : ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి- మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్ రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు సాయి బెంగళూరులో సాఫ్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. ఈనెల 28న తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లారు. దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్లో మాట్లాడారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్ రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్‌కు స్పందించలేదు. చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. చివరికి అతను రెడ్డి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారి ఇంట్లోకి వెళ్లి చూడగా.. తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూసింది. పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిఉన్నట్లు గమనించింది. దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించింది. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు క్లూస్ సేకరించి విచారణ ముమ్మరం చేశారు.
boy suspicious death: పాపం పసివాడు... పండగ వేళ అనుమానాస్పద మృతి
Governor Tamilisai Meerpet Gang Rape : మీర్పేట్ గ్యాంగ్ రేప్.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. పోలీసులకు గవర్నర్ ఆదేశాలు
Woman Murder in Nanakramguda : నానక్‌రాంగూడలో మహిళపై అత్యాచారం.. ఆపై హత్య! గవర్నర్, మహిళా కమిషన్ స్పందన