నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం 6 నెలలు పూర్తి కావొస్తున్న సందర్భంగా మే 26న 'బ్లాక్ డే' పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) నిర్ణయించింది. అదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టి 7 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు దిల్లీ సరిహద్దులకు చేరుకొని ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఎస్‌కేఎం కోరింది.
ఇంటి నుంచే నిరసన..
అయితే రాష్ట్రాల్లో కరోనా లాక్‌డౌన్ అమలవుతుండటం వల్ల ప్రజలు 'ఇంటి నుంచే నిరసన' తెలపాలని అఖిల భారత కిసాన్ సంఘర్షణ సమన్వయ కమిటీ కో కన్వీనర్ అవిక్ సాహ్ శనివారం విజ్ఞప్తి చేశారు. తమ ఇళ్లు, షాపులు, కార్యాలయాల్లో నల్ల జెండాలు ఎగురవేసి ఆందోళనకు మద్దుతు తెలపాలని కోరారు.
ఇదీ చూడండి: 'మా సహనాన్ని పరీక్షించొద్దు.. చర్చలు జరపండి'