Chhattisgarh High Court: మైనర్ బాలిక స్వచ్ఛందంగా తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతే.. దానిని కిడ్నాప్‌గా పరిగణించబోమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఓ తీర్పులో పేర్కొంది. దీని ప్రకారం పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైల్లో ఉంచిన సదరు వ్యక్తిని విడుదల చేయాలని ఆదేశించింది. 2017 మే 12న కాస్దోల్ ప్రాంతంలో ఓ బాలిక అదృశ్యమైంది. తమ కూతురు కనిపించట్లేదని బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం గాలించారు. సంవత్సరం తర్వాత 2018 మే 6న ఆమెను కనిపెట్టారు. రాథ్రే అనే యువకునితో అప్పటికే యువతికి పెళ్లై 3 నెలల చిన్నారి ఉంది.
ఆ యువకుడిని బలోదాబజార్ అడిషనల్ సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టగా.. అతడికి పోక్సో చట్టం కింద జైలు శిక్ష విధించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. స్వచ్ఛందంగానే ఆ వ్యక్తితో వెళ్లిపోయానని, పరస్పర అంగీకారంతోనే అతడితో సంబంధంలో ఉన్నానని బాలిక న్యాయస్థానానికి చెప్పింది. ఆమె వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకొని.. దిగువ కోర్టు తీర్పును రద్దుచేసింది హైకోర్టు.
ఇవీ చూడండి: పుట్టగొడుగులు తిని 13 మంది మృతి