ETV Bharat / bharat

'రైతుల నిరసనల వల్ల గ్రామాల్లో కరోనా వ్యాప్తి' - corona and hariyana cm

సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరిగిపోతోందని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్ ఖట్టర్ అన్నారు. వేల సంఖ్యలో జనం గుమిగూడుతూ.. కొవిడ్​ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు.

mahoar lal khattar on spread of corona in villages
రైతుల నిరసనల వల్ల గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందుతుందన్న హరియాణా సీఎం
author img

By

Published : May 31, 2021, 5:53 AM IST

గ్రామాల్లో కరోనా వ్యాప్తికి రైతుల ఆందోళనలు ఓ కారణం అని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్ ఖట్టర్ అన్నారు. కొన్ని గ్రామాల్లో గతేడాది కన్నా ఎక్కువ మరణాల రేటు నమోదైందని తెలిపారు.

రైతుల ఆందోళనల్లో పాల్గొన్నవారి గ్రామాల్లో, ధర్నాలు నిర్వహిస్తున్న గ్రామాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ గ్రామాల్లో గత ఏడాది కన్నా 6 నుంచి 10 శాతం మరణాల రేటు పెరిగింది. ఇది కరోనాతో కాదని వాదిస్తే.. ఇంకా ఏ మహమ్మారి ప్రస్తుతం లేదు. వేల సంఖ్యలో ఒకే దగ్గర గుమిగూడుతూ.. కొవిడ్​ నిబంధనలు పాటించలేదు.

-మనోహర్​ లాల్ ఖట్టర్, హరియాణా సీఎం

కరోనాపై అఖిలపక్ష భేటీ జరపాలని కోరిన మాజీ ముఖ్యమంత్రి భూపీందర్​ సింగ్​ హుడాను ఖట్టర్ విమర్శించారు. రైతుల ఉద్యమం ఆపమని మాత్రం కోరబోరని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పా సహకరించే స్వభావం ప్రతిపక్షానికి లేదని ఆరోపించారు.

కరోనా రెండో దశను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని భూపీందర్​ సింగ్​ హుడా విమర్శించారు.

ఇదీ చదవండి: మోదీ X దీదీ: తారస్థాయికి సీఎస్​ వివాదం

:'అర్థం లేని మాటలతో కొవిడ్​ను ఎదుర్కోలేం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.