ETV Bharat / bharat

మద్యం మత్తులో యాక్సిడెంట్.. సైలెన్సర్​లో చిక్కుకున్న శవంతో 2.5కి.మీ...

Khandwa Youth Trapped In Silencer: మద్యం మత్తులో కారు నడుపుతున్న డ్రైవర్​ ఓ యువకుడ్ని ఢీకొట్టాడు. ప్రమాదవశాత్తు బాధితుడు కారు సైలెన్సర్​లో చిక్కుకుపోయాడు. అది గమనించక రెండున్నర కిలోమీటర్లు యువకుడ్ని అలాగే లాక్కెళ్లాడు డ్రైవర్​. ఈ ఘటన మధ్యప్రదేశ్​ ఖాండ్వాలో జరిగింది.

Khandwa Youth Trapped In Silencer
సైలెన్సర్​లో చిక్కుకున్న యువకుడు
author img

By

Published : Feb 4, 2022, 7:32 PM IST

కారు సైలెన్సర్​లో చిక్కుకున్న యువకుడు

Khandwa Youth Trapped In Silencer: మధ్యప్రదేశ్ ఖాండ్వాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు సైలెన్సర్​లో చిక్కుకున్న యువకుడ్ని అలాగే రెండున్నర కిలోమీటర్లు లాక్కెళ్లాడు డ్రైవర్​. దీంతో శరీరం రోడ్డుకు రాసుకుని.. బాధితుడు తీవ్ర గాయాలతో మరణించాడు.

మామయ్య ఇంటికి వెళ్లి మద్యం మత్తులో కారు నడుపుతూ వస్తున్నాడు నిందితుడు. ఖాండ్వా ప్రాంతానికి చేరుకోగానే అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఓ యువకుడ్ని ఢీకొట్టింది కారు. అయితే.. ప్రమాదవశాత్తు బాధితుడు కారు సైలెన్సర్​లో చిక్కుకున్నాడు. అది గమనించని కారు డ్రైవర్ అలాగే వెళ్లిపోయాడు. సైలెన్సర్​లో యువకుడ్ని గమనించిన స్థానికులు.. కారును ఆపే ప్రయత్నం చేశారు. కానీ ప్రమాదానికి కారణమైనందుకు తనను చితకబాదుతారనే భయంతో కారు వేగాన్ని పెంచాడు డ్రైవర్​. ఈ క్రమంలో ఓ బైక్​ను కూడా ఢీకొట్టాడు. చివరకు అతి కష్టం మీద కారును ఆపారు స్థానికులు. సైలెన్సర్​లో చిక్కుకున్న యువకుడ్ని బయటికి తీయగా.. ఒళ్లంతా రక్తసిక్తమయ్యింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో కారు డ్రైవర్​ను అరెస్టు చేశారు పోలీసులు. బాధిత యువకుడి వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: లంగ్స్​లో ఇరుక్కుపోయిన లవంగం- ఏడేళ్ల తర్వాత బయటకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.