ETV Bharat / bharat

Khairathabad Ganesh 2023 : తొలి పూజ అందుకున్న ఖైరతాబాద్​ గణనాథుడు.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 1:30 PM IST

Updated : Sep 18, 2023, 2:48 PM IST

Khairathabad Ganesh 2023 : ఖైరతాబాద్‌ గణనాథుడు తొలి పూజ అందుకున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి గణేశుడి ప్రాణ ప్రతిష్ఠ, కలశ పూజలు నిర్వహించిన నిర్వాహకులు 11 గంటలకు తొలిపూజ జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పాల్గొన్నారు.

Ganesh Chaturthi Telangana 2023
Khairathabad Ganesh 2023
Khairathabad Ganesh ఖైరతాబాద్​ గణనాథుడు

Khairathabad Ganesh 2023 : ఏటా ఒక్కో రూపంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపయ్య.. ఈ సంవత్సరం దశ మహా విద్యాగణపతిగా కొలువుదీరారు. కుడి వైపున లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపున వీరభద్రస్వామి విగ్రహాలతో.. 63 అడుగుల ఎత్తుతో భక్తులకు కనువిందు చేస్తున్న విఘ్నేశ్వరుడికి ఉదయం 11 గంటలకు తొలి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​, హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బడా గణేశుడికి పద్మశాలీ సంఘం తరఫున 73 అడుగుల కండువా, జంధ్యం సమర్పించారు.

Khairatabad Ganesh Photo Gallery 2023 : ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల కోలాహలం.. సెల్ఫీలు తీసుకుంటూ సందడి

Ganesh Chathurthi 2023 : వినాయక ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచే ఖైరతాబాద్​ అధినాయకుడిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇందుకు అనుగుణంగా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గణేశుడి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. మండపం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Ganesh Chathurthi 2023 Telangana : ఖైరతాబాద్​ విఘ్ననాయకుడి తొలి పూజ అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ సికింద్రాబాద్​లోని గణేశ్​ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం పండితులు వేద మంత్రాలతో మంత్రికి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ తలసానికి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.

Swetharka Mula Ganapathi Temple Kazipet : తెల్లజిల్లేడు చెట్టు వేరుతో వినాయకుడి రూపం.. కాజీపేటలో శ్వేతార్క గణపతిగా కొలువైన లంబోదరుడు

కిక్కిరిసిన మార్కెట్లు..: ఇదిలా ఉండగా.. నేటి నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో హైదరాబాద్ గుడి మల్కాపుర్ మార్కెట్‌లో గణనాథుని పూజా సామగ్రి కొనుగోలుతో మార్కెట్ కిక్కిరిసిపోయింది. ఉదయం 6 గంటల నుంచే రోడ్ల పక్కన, మార్కెట్​లో భక్తుల కోలాహలం కనిపించింది. వినాయకుడిని కొలిచేందుకు పూలు, కాయలు, పండ్లు, రకరకాల పత్రిలు కొని తీసుకెళ్తున్నారు. విఘ్నేశ్వరుడు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే వెలగపండు, అరటి ఆకులు, బిల్వ పత్రాలు, గరిక, కరక్కాయలు, గుమ్మడి కాయలు, సీతాఫలాలు, రకరకాల పువ్వుల అమ్మకాలు, కొనుగోళ్లతో మార్కెట్లన్నీ రద్దీగా ఉన్నాయి.

Ganesh Chaturthi Telangana 2023 : వచ్చాడయ్యా.. గణపయ్యా.. తెలంగాణలో వినాయక చవితి సందడి షురూ

లంబోదరుడికి ఉండ్రాళ్లు అంటే మహా ప్రీతి. వీటితో పాటు ప్రసాదాల తయారీ కోసం అవసరమైన పదార్థాల కొనుగోళ్లతో షాపులు కూడా రద్దీగా ఉన్నాయి. నిన్నటి దాకా ప్రతిమలు కొనలేని వారు.. ఈరోజు ప్రతిష్ఠించడం కోసం కొనుక్కెళ్తున్నారు. స్వామి వారిని అలంకరించి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలు పండ్లు, కాయలు, ఆకులు తీసుకెళ్తున్నారు.

CM KCR Ganesh Chaturthi Wishes..: వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి హిందువులకు పవిత్రమైన పండుగ అన్న కేసీఆర్‌.. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు లంబోదరుడి ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. గణపతి నవ రాత్రులను ప్రజలు ఐక్యంగా జరుపుకోవాలని సూచించిన సీఎం.. పండుగ కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.

Cow Dung Ganesh Idols Nirmal 2023 : పర్యావరణాన్ని కాపాడే.. గోమయ గణపయ్యను చూసొద్దామా..?

Last Updated : Sep 18, 2023, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.