ETV Bharat / bharat

ఒకే కాన్పులో పుట్టిన నలుగురు- ఆన్​లైన్​ క్లాసులకు హాజరు!

ఒకే కాన్పులో పుట్టిన ఆ నలుగురు చిన్నారులు.. చదువులోనూ కలిసే సాగుతున్నారు. కేరళలో పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో.. అలప్పుజకు చెందిన వారు పుస్తకాలు చేత పట్టారు. ప్రస్తుతం వారంతా ఆన్​లైన్​లో ఒకటో తరగతి క్లాసులకు హాజరవుతున్నారు.

quadruplets school
నలుగురు కవలలకు పాఠశాల తరగతులు
author img

By

Published : Jun 2, 2021, 4:54 PM IST

ఒకే కాన్పులో పుట్టిన నలుగురు చిన్నారులు

అమ్మ కడుపులో ఉన్నప్పుడు వారంతా కలిసే పెరిగారు. ఇన్నాళ్లు ఇంటిదగ్గర ఆటపాటల్లోనూ కలిసే గడిపారు. పాఠశాల విద్యాభ్యాసాన్ని కూడా కలిసే ప్రారంభించారు. కేరళలో ఒకే కాన్పులో జన్మించిన చిన్నారులు ఆర్య, ఐశ్వర్య, ఆదర్శ్​, అదృశ్య.. ఇప్పుడు ఆన్​లైన్​లో ఒకటో తరగతి పాఠాలను వింటున్నారు.

quadruplets join school
పుస్తకాలు చూస్తున్న ఆర్య, ఐశ్వర్య, ఆదర్శ్​, అదృశ్య

అలప్పుజకు చెందిన శశికుమార్​- అజిత దంపతులకు ఒకే కాన్పులో నలుగురు కవలలు జన్మించారు. రెండు నెలల సెలవుల తర్వాత కేరళలో జూన్​1న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇటీవల పుతియాకావు ఉజువా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు.. శశికుమార్​ ఇంటికి వచ్చి, పిల్లల చదువుకు కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని అందించారు. దాంతో వారిప్పుడు ఆన్​లైన్​ తరగతులకు హాజరవుతున్నారు.

మొదట ముగ్గురే అనుకోగా..

అజిత గర్భంతో ఉన్నప్పుడు తన కడుపులో ముగ్గురు చిన్నారులు ఉన్నారని వైద్యులు మొదట భావించారు. అయితే.. సిజేరియన్​ చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీసి, కుట్లు వేసే క్రమంలో మరో చిన్నారి కూడా ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు పుట్టిన నాలుగో పాపకు వారు 'అదృశ్య' అని పేరు పెట్టారు. 2015, డిసెంబర్​ 8న ఉదయం 7 గంటలకు వీరంతా జన్మించారు.

మూడు రోజుల తర్వాత..

57 ఏళ్ల శశికుమార్​ తన మొదటి భార్య చనిపోగా.. అజిత(42)ను రెండో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చారు. అజిత ఏడు నెలలో గర్భంతో ఉన్నప్పుడు ఇబ్బందులు తలెత్తగా.. కొట్టాయం వైద్య కళాశాల ఆస్పత్రి వైద్యులు ఆమెకు ప్రసవం చేశారు. పుట్టిన వెంటనే.. నలుగురు చిన్నారులను ఇంక్యుబేటర్​లో ఉంచారు. మూడు రోజుల తర్వాతే.. అజిత తన పిల్లలను చూడగలిగారు.

కరోనాతో విధించిన లాక్​డౌన్​ వల్ల ఈ చిన్నారులు.. ఉదయాన్నే రెడీ అయ్యి.. స్కూల్​ యూనిఫామ్​ ధరించి, కొత్త బ్యాగులు, గొడుగుల పట్టుకుని బడికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ.. విద్యా ప్రపంచంలోకి అడుగు పెట్టినందున ఆ చిన్నారులు, వారి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

ఇదీ చూడండి: అక్కడ రెండు నెలల్లోనే 48 బాల్య వివాహాలు!

ఇదీ చూడండి: రూ.15లక్షలకు చిన్నారిని అమ్మిన డాక్టర్ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.