ETV Bharat / bharat

భాజపాకు 'హవాలా' చిక్కులు- తెరవెనుక బడా నేతలు!

కేరళలో కమలనాధులు వరుస కేసులలో ఇరుక్కుంటున్నారు. ఎన్నికల కోసం భాజపా నేతలు హవాలా డబ్బు తరలించారనే ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో భాజపా జాతీయ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే కాకుండా.. భాజపా సభకు హాజరు కావాలని ఓ పార్టీ నేతకు, నామినేషన్ ఉపసంహరించుకోవాలని మరో నేతకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

author img

By

Published : Jun 6, 2021, 5:42 PM IST

Kerala's BJP gets tangled in 'hawala' deals;
హవాలా' రాజకీయం-

కేరళలో ఇప్పటికే చతికిలపడిన భారతీయ జనతా పార్టీ మెడ చుట్టూ 'హవాలా' ఉచ్చు బిగుస్తోంది. పార్టీ కోసం హవాలా రూపంలో అక్రమ నగదు సరఫరా చేసిన ఉదంతం రాష్ట్రంలో చర్చనీయాశంగా మారింది.

కోళికోడ్​కు చెందిన షామ్​జీర్ షంషుద్దీన్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 7న పోలీసులకు ఫిర్యాదు చేసిన షంషుద్దీన్... ఓ క్రిమినల్ గ్యాంగ్ తన వద్ద నుంచి రూ.25 లక్షలను దోచుకున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 3న కారులో వెళ్తుండగా తనను అడ్డగించి డబ్బు తీసుకెళ్లారని తెలిపారు. రియల్ ఎస్టేట్ డీల్ పూర్తి చేసేందుకు ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.

రూ. 25 లక్షలు కాదు..

అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నగదు విలువ నగదు రూ.25 లక్షలు కాదు.. రూ. 3.5కోట్లు అని తేల్చారు.

భాజపా కోసం ఈ హవాలా సొమ్మును రవాణా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ వ్యవహారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్, రాజ్యసభ ఎంపీ సురేశ్ గోపి మెడకు చుట్టుకుంది. కేసులో భాగంగా వీరిరువురినీ ప్రశ్నించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సురేశ్ గోపి త్రిస్సూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. త్రిస్సూర్​కు చెందిన భాజపా నేతల ఆదేశాల మేరకే ఈ నగదును వారు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

హవాలా కోసం హెలికాప్టర్లు?

మరోవైపు, ఎన్నికల సమయంలో కేరళ భాజపా అధ్యక్షుడు సురేంద్రన్ హెలికాప్టర్లు ఉపయోగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సురేంద్రన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో తొలిసారి హెలికాప్టర్లను వినియోగించారు. ఇదంతా హవాలా డబ్బు తరలించేందుకేనని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. రోడ్డు మార్గంలో అయితే దొరికిపోతామని, అందుకే హవాలా డబ్బును కర్ణాటక నుంచి కేరళకు తరలించేందుకు హెలికాప్టర్లను వినియోగించారని కాంగ్రెస్ ఎంపీ కే మురళీధరన్ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి- 'కేరళలో 125 స్థానాల్లో భాజపా పోటీ'

అదే సమయంలో, సురేంద్రన్ అనుచరులు పెద్ద పెద్ద బాక్సులను మోస్తూ హెలికాప్టర్ నుంచి దిగుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవి హవాలా డబ్బులు ఉన్న పెట్టెలేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గెలిచే సత్తా లేని భాజపా అభ్యర్థులకు కూడా రూ.75 లక్షలు చొప్పున నల్లధనాన్ని అందించారని చెబుతున్నారు.

రాష్ట్రంలో ఉన్న ఒక్క(నెమోమ్) సీటును భాజపా గత ఎన్నికల్లో పోగొట్టుకుంది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు వెలుగులోకి రావడం జాతీయ నాయకత్వానికీ తలనొప్పిగా మారింది.

అధినాయకత్వం మౌనం

మరోవైపు, భాజపా అధిష్ఠానం ఈ విషయంపై మౌనం వహించింది. కేరళ భాజపా అగ్రనేత, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కేంద్ర మంత్రి వీ మురళీధరన్ దీనిపై ఇప్పటివరకు నోరువిప్పలేదు. రాష్ట్రంలోని కీలక నేతల పేర్లన్నీ కేసులో బయటపడుతున్న నేపథ్యంలో అధిష్ఠానం ఆత్మరక్షణలో పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి- 'ఆర్​టీసీ వివాదంపై న్యాయపోరాటం చేయబోం'

ఈ నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్.. విమర్శలకు పదునుబెట్టింది. హవాలా ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.

13 మంది అరెస్టు

ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు. రూ. 1.5 కోట్లు సీజ్ చేశారు. అరెస్టైన వారు ఇచ్చిన సమాచారాన్ని బట్టి.. ఈ డబ్బు భాజపా కోసం తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. దీని వెనుక భాజపా నేతలు ఎవరు ఉన్నారన్న విషయాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పటికే భాజపా రాష్ట్ర కార్యదర్శి జీ గిరీశ్, ప్రధాన కార్యదర్శి ఎం గణేశ్​కు సమన్లు జారీ చేశారు. అయితే వీరంతా హవాలా ఆరోపణలను ఖండించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ధర్మాజన్ ఆరెస్సెస్ కార్యకర్త అని, ఆ సంస్థకు సంబంధించిన విషయాలే ఆయనతో చర్చించే వారిమని గణేశ్ వివరణ ఇచ్చారు.

కానీ, పోలీసులకు ధర్మాజన్ ఇచ్చిన స్టేట్​మెంట్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. కోళికోడ్​ నుంచి వాహనంలో డబ్బు తరలించే సమయంలో గణేశ్ తనతోనే ఉన్నారని ధర్మాజన్ స్పష్టం చేశారు. అనంతరం, త్రిస్సూర్ జిల్లా అధ్యక్షుడు కేకే అనీశ్ కుమార్​ను సైతం పోలీసులు ప్రశ్నించారు.

మరో కేసు...

హవాలాతో పాటు మరో సమస్య భాజపాను వెంటాడుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్న వయనాడ్ సభకు హాజరు కావాలని జనాతిపత్య రాష్ట్రీయ పార్టీ(జేఆర్​పీ) అధ్యక్షురాలు సీకే జానూకు భాజపా రూ. 10 లక్షలు ఇచ్చిందని జేఆర్​పీ కోశాధికారి ప్రసీత అళీకోడె ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్​కు, తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డింగ్​ను విడుదల చేశారు. ఈ అంశంపైనా పోలీసులు విచారణ ముమ్మరంగా సాగిస్తున్నారు. సురేంద్రన్ అనుచరుడితో పాటు డ్రైవర్​ను ప్రశ్నించారు.

పోటీ నుంచి వైదొలగాలని లంచం!

మరోవైపు, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్​పీ)కి చెందిన కే సుందర మరో సంచలన ఆరోపణ చేశారు. మంజేశ్వరం నియోజకవర్గం నుంచి సురేంద్రన్​పై ఈయన పోటీ చేశారు. కొద్దిరోజులకే బరిలో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే, నామినేషన్ ఉపసంహరించుకోవాలని భాజపా తనకు లంచం ఇచ్చిందని.. అందుకే తాను తప్పుకున్నానని సుందర పేర్కొన్నారు.

ఇదీ చదవండి- అభివృద్ధి ర్యాంకులో కేరళ మళ్లీ టాప్

సురేంద్రన్ తనకు ఫోన్ చేసి రూ. 15 లక్షలు, ఓ స్మార్ట్​ఫోన్ ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. కానీ, నామినేషన్ ఉపసంహరణ తర్వాత స్మార్ట్​ఫోన్​తో పాటు రూ. 2.5 లక్షలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఒకవేళ సురేంద్రన్ గెలిస్తే కర్ణాటకలోని మంగళూరులో వైన్ పార్లర్ ఏర్పాటు చేయిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.

బీఎస్​పీ తరపున బరిలోకి దిగిన సుందర.. నామినేషన్ ఉపసంహరణ గడువుకు కొద్దిరోజుల ముందు కనిపించకుండా పోయారు. ఆయనపై పార్టీ నేతలు మిస్సింగ్ కేసు దాఖలు చేశారు. తర్వాత బయటకు వచ్చిన సుందర.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.

సుందర ఏమీ పెద్ద పలుకుబడి ఉన్న నేత కాదు. కానీ, ఆయన పేరు తన​ పేరుకు దగ్గరగా ఉండటం వల్ల సురేంద్రన్​ ఇలా చేసినట్లు తెలుస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సురేంద్రన్​పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుందర.. 467 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో సురేంద్రన్ కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చాలా ఓట్లు తప్పుగా సుందరకు వెళ్లిపోయాయని పార్టీలోని వర్గాలు అప్పుడే భావించాయి.

ఇదీ చదవండి- దిల్లీ ఆసుపత్రిలో 'మలయాళ' దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.