ETV Bharat / bharat

పిల్లల కోసం డి-అడిక్షన్‌ సెంటర్లు.. ఎందుకంటే?

ఆన్‌లైన్‌ గేమింగ్(Online Games)​ ఎంతో మంది చిన్నారులకు వ్యసనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడిన పిల్లలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకోసం ఆన్‌లైన్‌ గేమ్స్‌(Online Games) డి-అడిక్షన్‌ సెంటర్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఆన్‌లైన్‌ గేమ్స్‌ డి-అడిక్షన్‌
digital de-addiction centres for children
author img

By

Published : Sep 26, 2021, 6:49 AM IST

ఇప్పటి వరకు మద్యం, ధూమపానం.. ఈ రెండింటికే డి-అడిక్షన్‌ సెంటర్లు నిర్వహిస్తారని వింటూ వచ్చాం. కానీ కేరళ ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమ్స్‌కి(Online Games) బానిసవుతున్న చిన్నారులను దృష్టిని పెట్టుకొని డిజిటల్‌ ఆన్‌లైన్‌ గేమ్స్‌(Online Games) డి-అడిక్షన్‌ సెంటర్లను ప్రారంభించనుంది.

తరచూ డిజిటల్‌ గేమ్స్‌ ఆడటం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలెక్కువ. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు 'డిజిటల్‌ డి-అడిక్షన్‌ సెంటర్లు'ను కేరళలో ప్రారంభిస్తున్నట్లు శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. ఈమేరకు రాష్ట్రంలోని 20 పోలీస్‌ స్టేషన్లను 'చైల్డ్‌-ఫ్రెండ్లి'గా ప్రకటించారు.

ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయన్​ ప్రారంభించారు. "ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడిన పిల్లలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకే ఈ ప్రయత్నం." ఆయన తెలిపారు. కేరళలో అనేకమంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ గేమింగ్‌(Online Games) వ్యసనంగా మారింది.

ఇదీ చూడండి: వారానికి 3 గంటలే ఆన్​లైన్ గేమ్స్.. సర్కారు ఆంక్షలు!

ఇదీ చూడండి: ఆన్​లైన్ గేమ్​ కోసం అమ్మ నగలనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.