Kerala seven kg gold seized: కేరళలో భారీగా అక్రమ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. కరిపుర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఓ విమానంలోని ప్రయాణికుల నుంచి 7 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. లో దుస్తులు, మలద్వారంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. బంగారం రవాణాపై తమకు సమాచారం అందిందని.. ఈ మేరకు పగడ్బందీ చర్చలు తీసుకొని స్మగ్లర్లను గుర్తించామని అధికారులు తెలిపారు.
నిందితులను అబ్దుల్ సమద్, సాఫ్నాగా గుర్తించారు. వీరిద్దరూ భార్యాభర్తలని చెప్పారు. అమ్మినిక్కడ్కు చెందిన వీరిద్దరూ ఇమ్మిగ్రేషన్ వద్దకు రాగానే అధికారులు అడ్డుకున్నారు. సాఫ్నా ఐదు నెలల గర్భంతో ఉందని వివరించారు. చికిత్స కోసం వెళ్తున్నట్టు చెప్పి అధికారులను మోసం చేయొచ్చని.. నిందితులు భావించినట్లు చెప్పారు. అందుకే భారీగా సామగ్రి తీసుకొచ్చారని తెలిపారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
మంగళవారం సైతం.. అధికారులు రూ.3.25 కోట్ల విలువ చేసే బంగారాన్ని సీజ్ చేశారు. ద్రవ రూపంలో 6.26 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు నిందితులు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేశారు.
ఇదీ చదవండి:
వైరల్ వీడియో.. వ్యాన్ను ఢీకొట్టిన బైక్.. ఎగిరి మరో వాహనంపై తల్లీకుమారుడు