దేశంలో కరోనా తీవ్రత స్వల్పంగా తగ్గింది. కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కేరళలో (kerala covid cases) వరసగా రెండో రోజు కూడా 15వేల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో (Corona Update) కొత్తగా 15,876 కేసులు నమోదు కాగా.. 129 మంది ప్రాణాలు కోల్పోయారు. 25,654 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 15.12 శాతంగా ఉంది.
ఇతర ప్రాంతాల్లో కరోనా కేసులు..
- మహారాష్ట్రలో కొత్తగా 3530 కరోనా కేసులు నమోదయ్యాయి. 3685 మంది కోలుకోగా..52 మంది మృతిచెందారు.
- మిజోరంలో కొత్తగా 1502 మందికి కరోనా సోకింది. వీరిలో 300 చిన్నారులు కూడా ఉన్నారు. వైరస్ ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.. దీంతో మొత్తం మృతుల సంఖ్య 244కి చేరింది.
- బంగాల్లో కొత్తగా 703 కరోనా కేసులు బయటపడ్డాయి. 713 మంది కోలుకోగా.. 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 559 కొవిడ్ కేసులు వేలుగు చూశాయి. 1034 మంది వైరస్ను జయించగా.. 12 మంది మృతిచెందారు.
- ఒడిశాలో కొత్తగా 428 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఐదు నెలల్లో ఇంత తక్కువ నమోదు కావడం ఇదే తొలిసారి.
- దిల్లీలో కొత్తగా 38 కరోనా కేసులు బయటపడగా.. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.
దేశవ్యాప్తంగా మంగళవారం.. 54 లక్షల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ సంఖ్య 75,81,99,331కు చేరింది.
ఇదీ చూడండి : ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు- ఒక్కరోజే 12 కేసులు వచ్చాయని...