దేశంలో కొవిడ్ కల్లోలం (Corona cases in India) కొనసాగుతోంది. ముఖ్యంగా కేరళలో ఇటీవల కాస్త తగ్గినట్లు కనిపించిన కొవిడ్ ఉద్ధృతి మళ్లీ పెరిగింది. తాజాగా ఈ రాష్ట్రంలో 23,260 కరోనా (Kerala COVID cases) కేసులు నమోదయ్యాయి. మహమ్మారికి 131 మంది బలయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 23,296 మంది కరోనాతో మృతి చెందారు.
తాజాగా కేరళవ్యాప్తంగా 20,388 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీల సంఖ్య 42,56,697కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,88,926 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇలా..
- మహారాష్ట్రలోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 3,586 కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. 4,410 మంది కొవిడ్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 48,451 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
- కర్ణాటకలో కొత్తగా 1,003 కరోనా కేసులు నమోదయ్యాయి. 18 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. 1199 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,960 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- తమిళనాడులో 1,669 మందికి కొత్తగా కరోనా నిర్ధరణ అయింది. 17 మంది మహమ్మారి వల్ల మరణించారు. 1,565 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- రాజధాని నగరం దిల్లీలో మరో 33 మందికి కరోనా సోకింది. ఒకరు కరోనాతో మరణించారు. నగరంలో పాజిటివ్ రేటు 0.04 శాతంగా ఉన్నట్లు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
వ్యాక్సినేషన్ రికార్డు..
టీకా పంపిణీలో శుక్రవారం భారత్ చరిత్ర సృష్టించింది. ఒక్కరోజులో 2కోట్లకుపైగా వ్యాక్సిన్లు అందించింది. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా దూసుకెళుతోంది. రాత్రి 9:30 వరకు 2.25కోట్ల డోసులను పంపిణీ చేశారు. మధ్యాహ్నం 1:30వరకు కోటి డోసులు అందివ్వగా.. 4 గంటల్లోనే మరో కోటి టీకాలు ఇవ్వడం విశేషం.
ఇవీ చదవండి: