కేరళలో కరోనా కేసులు (corona cases) సోమవారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 23,676 కేసులు నమోదయ్యాయి. మరో 15,626 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 148 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34.49 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 17,103 మంది వైరస్ బారిన పడి మృతిచెందారు.
ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరి..
కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షల తప్పనిసరి చేస్తూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిడ్ నెగటివ్ రిపోర్టు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈనెల 8 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది.
- మహారాష్ట్రలో కొత్తగా 6,005 మందికి కరోనా సోకింది. 6,799 మంది కోలుకోగా.. 177 మంది మృతిచెందారు.
- కర్ణాటకలో కొత్తగా 1,674 కేసులు నమోదయ్యాయి. 1,376 మంది కోలుకోగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో కొత్తగా 1,129 కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 1,785 మంది కోలుకోగా.. 69 మంది మృతిచెందారు.
- హిమాచల్ ప్రదేశ్‌లో కొత్తగా 220 మందికి కరోనా సోకింది. 108 మంది కోలుకోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి : 'ఆ 10 మంది సంగతి చూస్తాం'.. పోలీసుల షాకింగ్ ప్రకటన