కేరళలో కరోనా కేసులు (corona cases) స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 22,040 కేసులు నమోదయ్యాయి. మరో 17,328 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 117 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34.93 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 17,328 మంది వైరస్ బారిన పడి మృతిచెందారు.
మహారాష్ట్రలో కొత్తగా 6,695 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 120 మంది ప్రాణాలు కోల్పోగా.. 7,120 మంది కోలుకున్నారు. తమిళనాడులో 1,997 కరోనా కేసులు నమోదవగా.. వైరస్ ధాటికి మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,943 మంది వైరస్‌ను జయించారు.
వివిధ రాష్ట్రాల్లో కేసులు..
- కర్ణాటకలో కొత్తగా 1,785 కేసులు నమోదయ్యాయి. 1,651 మంది కోలుకోగా.. 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో కొత్తగా 1,342 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 1,630 మంది కోలుకోగా.. 68 మంది మృతిచెందారు.
- మిజోరంలో 1,088 కొత్త కరోనా కేసులు వెలుగు చూడగా.. 684 మంది కోలుకున్నారు. వైరస్ ధాటికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
- గుజరాత్లో మరో 102 మందికి కరోనా సోకినట్లు తేలగా.. రాజస్థాన్‌లో 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
- మణిపుర్లో కొత్తగా 757 మందికి కరోనా సోకింది. 1,078 మంది కోలుకోగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చూడండి: