కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొట్టాయం జిల్లా కూట్టిక్కల్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 24కి చేరింది. మృతదేహాల కోసం నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. బురద, శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్నాయి.
అనతోడు, కక్కి డ్యాం సహా 10 డ్యాంల పరిధిలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుండటం వల్ల గేట్లు ఎత్తి వరదను కిందికి వదులుతున్నారు. డ్యాం అలప్పుజా, ఇడుక్కి, కుట్టనాడ్‌లనూ భారీ వర్షాలు కుదిపేయగా ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు జలమయంగా మారాయి.
మరోవైపు.. వర్షాల కారణంగా అక్టోబర్ 12 నుంచి ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 38కి చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కనీసం 90 ఇళ్లు ధ్వంసమవగా.. 702 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఎస్ఎండీఏ నివేదిక తెలిపింది.
దేశవ్యాప్తంగా విస్తారంగా వానలు..
- దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా.. వరదల ధాటికి ఉత్తరాఖండ్‌లో నేపాల్‌కు చెందిన ముగ్గురు కూలీలు సహా ఐదుగురు మరణించారు. దీనితో తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంతవరకు చార్ధామ్ యాత్రను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- అల్పపీడనం కారణంగా బంగాల్‌లోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు సాధారణ జన జీవితాన్ని ప్రభావితం చేశాయి.
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్, షామ్లీ, బాగ్‌పత్, మేరఠ్ జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతేగాక తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు.
- ఉత్తర బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ఒడిశా తీరప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.
- దిల్లీలో 1960తర్వాత అత్యధిక వర్షపాతం ఈ ఏడాది అక్టోబర్‌లో నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఇవీ చదవండి: