కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) దూసుకుపోతోంది. 'ఎల్డీఎఫ్దే మళ్లీ అధికారం' నినాదంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. తిరువనంతపురంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాష్ట్ర సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏ విజయరాఘవన్ ప్రచారానికి సబంధించిన ట్యాగ్‌లైన్‌ను అందజేశారు. కేరళవ్యాప్తంగా ఈ నినాదంతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి.
తమ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు విజయన్. ఎల్డీఎఫ్ ఎన్నికల నినాదం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన క్రైస్తవ మతాధికారులు గత ఐదేళ్లలో కేరళ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫొటోలను విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్‌తో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
140స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు విడుదలవుతాయి.
ఇదీ చదవండి: కేరళ ఫలితాలను శాసించే 'సామాజిక లెక్క'లు