ETV Bharat / bharat

కూతుళ్లపై తండ్రి అత్యాచారం- 4 జీవిత ఖైదుల శిక్ష - ఒకే వ్యక్తికి రెండు జీవిత ఖైదులు

మానవత్వం మరిచి కన్న కూతుళ్లపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ కామాంధుడికి కేరళలోని మంజేరి పోక్సో ప్రత్యేక కోర్టు నాలుగు జీవిత ఖైదులు విధించింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకరి వయసు 15, మరొకరి వయసు 17.

double life term for raping minor daughters
కుతుళ్లపై అత్యాచారం కేసులో తండ్రికి జీవిత ఖైదు
author img

By

Published : Aug 26, 2021, 10:36 AM IST

Updated : Aug 26, 2021, 7:40 PM IST

సొంత కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని కేరళలోని మంజేరీ 'పోక్సో' ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చి.. నాలుగు జీవిత ఖైదుల శిక్ష విధించింది. రూ.3 లక్షల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించింది. మరో కేసులో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. జరిమానా కట్టడంలో విఫలమైతే.. మరో రెండేళ్ల శిక్ష అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

ప్రస్తుతం అదే వ్యక్తి మరో కూతురిని లైంగికంగా వేధించిన కేసులో జైలులో ఉన్నాడు. ఆ వ్యక్తికి.. ఇండియన్ పీనల్​ కోడ్​లోని వివిధ సెక్షన్ల కింద జైలు శిక్ష విధించింది కోర్టు. కూతుళ్లిద్దరూ మైనర్లు (ఒకరు 15, మరొకరు 17) కావడం గమనార్హం.

భార్యతో గొడవ.. కుతుళ్లకు వేధింపులు..

తన భార్యతో గొడవ పడి విడిపోయిన తర్వాత.. 2014-2016 మధ్యలో తన ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధించసాగాడు అతడు. కూతుళ్లిద్దరూ తల్లికి చెప్పగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2016లో భర్త అఘాయిత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. లైంగిక వేధింపుల విషయాన్ని తల్లికి చెప్పారనే కారణంతో పలు మార్లు కూతుళ్లిద్దరినీ చంపుతానని బెదిరింపులకు కూడా పాల్పడ్డాడతడు.

తొలుత 15 ఏళ్ల కూతురు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం 17 ఏళ్ల కూతురు సైతం తండ్రి కర్కశత్వంపై నోరు విప్పింది. ఈ ఘటనపై ఎడక్కార సర్కిల్ ఇన్​స్పెక్టర్ కే దేవస్సియా విచారణ చేపట్టి.. నిందితుడిపై రెండు కేసుల్లో అభియోగ పత్రాలు దాఖలయ్యేలా చూశారు. 17 మంది సాక్షులను న్యాయస్థానం ముందు హాజరుపర్చి, 12 ఆధారాలను సమర్పించారు.

చివరి శ్వాస వరకు జైల్లోనే

దీనిపై విచారణ చేపట్టిన పోక్సో న్యాయస్థానం.. నిందితుడిని దోషిగా తేల్చింది. కన్నకూతుళ్లపై కూడా కనికరం చూపించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. తొలి కేసులో ఆగస్టు 13న, రెండో కేసులో ఆగస్టు 25న తీర్పు వచ్చింది. దోషి.. తన తుది శ్వాస విడిచే వరకు జైలులోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి: కొండ ప్రాంతంలో కాలేజీ యువతిపై గ్యాంగ్​ రేప్

Last Updated : Aug 26, 2021, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.