కేరళ మలప్పురానికి చెందిన ఓ చిన్నారి.. తన జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తోంది. ఏడాదిన్నర వయసులోనే.. ట్రాఫిక్ సిగ్నల్స్ రంగుల అర్థం ఏంటో చకచకా చెప్పేస్తోంది. అంతేకాదు.. 40 దేశాల జెండాలను తన ముందు పెడితే ఏది ఏ దేశానిదో ఇట్టే గుర్తిస్తోంది. కేరళ మలప్పురానికి చెందిన ఇషా అనే ఈ చిన్నారి తన అసాధారణ ప్రతిభతో అందరితో 'వావ్' అనిపించుకుంటోంది.
ఏడు నెలల వయసులో 'ఏ'తో ప్రారంభం..
చుంగతారా ప్రాంతానికి చెందిన సీకే అన్షిద్, ఎన్ కృష్ణ దంపతుల ఏకైక కుమార్తె ఇషా. ఏడు నెలల వయసున్నప్పుడు ఇషాకు ఓ రోజు తన అమ్మానాన్న ఆంగ్ల వర్ణమాల లోని 'ఏ' అనే అక్షరాన్ని నేర్పించారు. అంతే.. ఇక ఆ చిన్నారి బిల్ బోర్డులపైన, పోస్టర్లపైనా ఉండే పేర్లలో 'ఏ' అక్షరాన్ని గుర్తిస్తూ చెప్పడం వాళ్ల తల్లిదండ్రులు గమనించారు. దాంతో ఆమెకు మరిన్ని అక్షరాలను, సంఖ్యలను నేర్పించడం ప్రారంభించారు.
చిన్నారి ఇషా.. 26 రకాల జంతువులు,12 రకాల సముద్ర ప్రాణులు, 20 రకాల పుష్పాలు, 20 రకాల వాహనాలు, 24 రకాల కూరగాయలు, పండ్లు, 10 రకాల ఆహార పదార్థాలు, 6 రకాల సంగీత వాయిద్య పరికరాలు, 24 రకాల గృహోపకరణాలు, 1 నుంచి 20 వరకు సంఖ్యలు, త్రిభుజం, చతురస్రం వంటి 10 రకాల ఆకారాలను ఇప్పుడు గుర్తిస్తోంది. ఇషా తన జ్ఞాపకశక్తి ప్రతిభతో.. మే 18న 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో' స్థానం సంపాదించింది.
అద్భుతాలు చెప్పే ఇషా ప్రతిభ అత్యద్భుతం
ప్రపంచంలో జరిగిన వివిధ అద్భుతాలను కూడా చిన్నారి ఇషా ఒకదాని వెంట మరొకదాన్ని సులభంగా చెప్పేయగలదు. గజిబిజిగా ఉన్న ఆంగ్ల అక్షరాలను సక్రమంగా పెట్టగలదు. పజిళ్లను పూర్తి చేయగలదు. సంప్రదాయ నృత్యాలను, శరీర అవయవాలను ఇషా గుర్తుపట్టగలదు. ఆమె ప్రతిరోజు ఏదో ఓ కొత్త పదం నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుదని ఇషా అమ్మనాన్న తెలిపారు. నీలంబుర్ ప్రాంతంలో ఇషా ఓ మెడికల్ క్లినిక్‌ను నిర్వహించే ఇషా అమ్మానాన్న తమ కూతురికి ప్రతిభకు ఎంతో మురిసిపోతున్నారు.
ఇదీ చూడండి: భార్య హంతకుడి తలకు రైతు రివార్డు!
ఇదీ చూడండి: రోబో టైమ్- వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు