ETV Bharat / bharat

Uthra murder case: భర్తను పట్టించిన పాములు- ఎలాగంటే... - కేరళ పాముకాటు హత్య కేసు

కేరళలో పాము కాటుతో భార్యను హత్య చేసిన కేసు(Uthra murder case) దర్యాప్తునకు సంబంధించిన కీలక వీడియో బయటకువచ్చింది. పాములతో డమ్మీ ప్రయోగం చేసి కేసును ఎలా చేధించారనే విషయాన్ని అధికారులు అందులో వెల్లడించారు.

Uthra murder case
ఉత్రా హత్య కేసు
author img

By

Published : Aug 26, 2021, 5:24 PM IST

Updated : Aug 26, 2021, 5:49 PM IST

ఉత్రా కేసు దర్యాప్తునకు సంబంధించి విడుదలైన కీలక వీడియో

ఉత్రా హత్య కేసు(Uthra murder case) దర్యాప్తునకు సంబంధించి కీలక వీడియో విడుదలైంది. అందులో ఉత్రాను పాము ఎలా కరించిందో డమ్మీ ప్రయోగం చేసి నిర్ధరించారు అధికారులు. కేరళ కొల్లాంలోని రాష్ట్ర అటవీ విభాగానికి చెందిన అరిప్పా శిక్షణా కేంద్రంలో ఈ పరీక్ష జరిగింది.

ఏంటీ ఉత్రా కేసు?

2020 మేలో ఈ ఘటన జరిగింది. అంచల్​ పట్టణానికి చెందిన ఉత్రా, సూరజ్ భార్యాభర్తలు. కొన్నాళ్లుగా బాగానే ఉన్న సూరజ్​.. తరువాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు అడ్డంగా ఉన్న తన భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనితో ఆమెను అనుమానం రాకుండా హత్య చేయాలని పథకం వేశాడు.

ఇదీ చూడండి: పాముతో భార్యను చంపింది.. అందుకోసమే!

యూట్యూబ్​లో క్రైమ్ పాఠాలు..

యూట్యూబ్​లో చూసి పాముల ద్వారా ఎలా హత్య చేయాలో నేర్చుకున్నాడు. సురేష్​ అనే పాములవాడికి డబ్బులు ఇచ్చి పామును తీసుకున్నాడు. తరువాత ఇంటికి వచ్చి నిద్రపోతున్న భార్యపై ఆ పామును విసిరేశాడు. ఆ పాము ఉత్రాను రెండు సార్లు కాటువేసింది.

కూతురు మృతిపై అనుమానం

ఉత్రా పాము కాటుతో మరణించడం.. ఇంతకు ముందు కూడా ఆమె పాముకాటుకు గురికావడంపై ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు సూరజ్​ను అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారించారు.

Uthra murder case
నిందితుడి ఇంటి వద్ద పోలీసులు

పాముకు శవపరీక్ష..

అటవీ అధికారుల బృందంతో కలిసి నిందితుడు తన నివాసంలో పాతిపెట్టిన పాము కళేబరాన్ని జాగ్రత్తగా తవ్వి బయటకు తీశారు పోలీసులు. పాము కాటు వల్లే బాధితురాలు(ఉత్రా) మరణించిందనే విషయం శవపరీక్షల్లో స్పష్టమైందని వెల్లడించారు. దాదాపు 152 సె.మీ.ల పొడవైన పాము ఇప్పటికే కుళ్లిపోయే స్థితికి చేరుకుందని, అయితే శవపరీక్షకు అవసరమైన నమూనాలు తీసుకోగలిగినట్లు పేర్కొన్నారు. పాము కోరలను సైతం నమూనాల కోసం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ బృందం సేకరించిన నమూనాలను తదుపరి పరీక్షల కోసం పంపించారు.

ఇదీ చూడండి: హత్య కేసులో పాముకు శవపరీక్షలు.. తేలిందేంటంటే!

ఇక అది సహజ పాటు కాదని రుజువు చేయడానికి అదే ఏడాది ఆగస్టులో మూడు డమ్మీ పాములతో ప్రయోగం చేశారు అధికారులు.

Uthra murder case
పామును వెలికి తీసిన ప్రదేశం

ప్రయోగంలో ఏం తేలింది?

సహజంగా కన్నా ప్రేరేపిస్తే పాము పెద్ద గాయం చేస్తుందనే సైన్స్ సూత్రం ఆధారంగా ఈ ప్రయోగం జరిగింది. ఉత్రాకు రెండు చోట్ల 2.5సె.మీలు, 2.8సె.మీల పొడవుతో 150సె.మీలు ఉన్న పాము గాయం చేసింది.

కానీ 150సె.మీలున్న పాము సహజంగా కాటు వేసిన సమయంలో 1.7సె.మీల పొడవు మాత్రమే గాయపరుస్తుంది. దీంతో ఆమెను హత్య చేయడానికి పామును ప్రేరేపించారని తేల్చారు అధికారులు. ఈ మేరకు ఆ ప్రయోగానికి సంబంధించిన వీడియోను రుజువు కింద కోర్టుకు సమర్పించారు.

ఇదీ చూడండి: Condom: కండోమ్‌ మరిచిపోయి అసహజ రీతిలో.. చివరకు?

Last Updated : Aug 26, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.