బంగారం కుంభకోణంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నిందితురాలైన స్వప్నా సురేష్ ఈ మేరకు రహస్యంగా వాంగ్మూలం ఇచ్చారని హైకోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నారు. యూఏఈ కాన్సులేట్ జనరల్‌తో ముఖ్యమంత్రితో సహా స్పీకర్, ముగ్గురు మంత్రులకు సంబంధాలున్నాయని, ఈ కేసుతో నేరుగా ప్రమేయం ఉందని స్వప్న వెల్లడించినట్లు స్పష్టం చేశారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు సీఎం ముందే జరిగాయని ఆమె చెప్పినట్లు వివరించారు.
యూఏఈకి చెందిన అరబిక్ భాష మంత్రులకు తెలియనందున తాను మధ్యవర్తిగా ఉన్నానని స్వప్న చెప్పినట్లు కస్టమ్స్ అధికారులు కోర్టుకు నివేదించారు. బంగారం కుంభకోణం కేసులో సీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. శివశంకరన్‌కు ఈ వ్యవహారంలో ప్రధాన సంబంధాలున్నాయని వివరించారు.
ఇదీ చదవండి: 'ఇది కేరళ.. భాజపా రౌడీయిజం ఇక్కడ కుదరదు'