ETV Bharat / bharat

'బురేవి'ని ఎదుర్కొనేందుకు కేరళ, తమిళనాడు సన్నద్ధం - బంగాళకాతంలో అల్పపీడనం

వేగంగా దూసుకొస్తున్న బురేవి తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి కేరళ, తమిళనాడు రాష్ట్రాలు. గురువారం రాత్రి తమిళనాడులోని పంబన్​, కన్యకుమారి మధ్య తుపాను తీరం దాటనుంది. శుక్రవారం కేరళలోని తిరువనంతపురం తీరాన్ని చేరనుంది. ఈ సమయంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

cyclone burevi
బురేవి తుపాను
author img

By

Published : Dec 3, 2020, 10:06 AM IST

నైరుతి బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారి కేరళ, తమిళనాడువైపుగా దుసుకొస్తోంది. డిసెంబర్​ 4న తీరం దాటనుంది తుపాను. దీంతో డిసెంబర్​ 3 నుంచి 5 తేదీల మధ్య కేరళలోని ఏడు దక్షిణ జిల్లాలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Cyclone Burevi
కేరళలో మత్సకారులతో మాట్లాడుతోన్న ఎన్​డీఆర్​ఎఫ్​ అధికారులు

ఈ క్రమంలో తుపానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టింది కేరళ ప్రభుత్వం. ఇప్పటికే 2,849 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్​ తెలిపారు. మరో మూడు రోజుల పాటు చేపల వేటకు వెల్లటాన్ని నిషేధించారు.

" రాష్ట్రానికి 8 ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. శుక్రవారానికి తుపాను తిరువనంతపురాన్ని తాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీతో కూడా తుపాను గురించి మాట్లాడాం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇప్పటికే 175 కుటుంబాలకు చెందిన 690 మందిని 13 శిబిరాలకు తరలించాం. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున శబరిమలకు వచ్చే భక్తులపై వాతావరణాన్ని అనుసరించి ఆంక్షలు ఉంటాయి. "

- పినరయి విజయన్​, కేరళ ముఖ్యమంత్రి.

రెడ్​ అలర్ట్​..

తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్​ అలర్ట్​ ప్రకటించింది వాతావరణ శాఖ. కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ ప్రకటించింది.

Cyclone Burevi
కేరళలో ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సన్నద్ధత

తమిళనాడులో..

తుపాను బురేవి తమిళనాడులోని పంబన్​, కన్యకుమారి మధ్య గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జామున తీరం దాటనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ క్రమంలో సహాయక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. రాష్ట్రానికి ఇప్పటికే 2 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు చేరుకున్నాయి.

Cyclone Burevi
తమిళనాడులో ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది

బురేవి నేపథ్యంలో రామేశ్వరం తీరాన్ని సందర్శించారు రాష్ట్ర మంత్రి ఆర్​బీ ఉదయ్​కుమార్​. తీరప్రాంత, లోతట్టు ప్రజలు సహాయక శిబిరాలకు వెల్లాలని కోరారు. సముద్రంలోకి చేపల వేటకు వెల్లిన మత్సకారులు ఇళ్లకు చేరినట్లు తెలిపారు.

Cyclone Burevi
కన్యకుమారిలో సముద్ర తీరం
Cyclone Burevi
రామేశ్వరం తీరంలో అధికారులతో మాట్లాడుతోన్న రాష్ట్ర మంత్రి

ఇదీ చూడండి: ఆ సీఎంలకు మోదీ ఫోన్- 'బురేవి'పై ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.