ETV Bharat / bharat

'నా భార్య కూడా మీలా తిట్టదు.. ఇలా లవ్​ లెటర్స్ పంపదు'.. గవర్నర్​కు సీఎం కౌంటర్ - దిల్లీ ప్రభుత్వం వివాదం

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్నంగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల తనకు ఎల్​జీ వరుసగా లేఖలు రాయడాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

kejriwal-delhi-lieutenant-governor-vk-saxena

author img

By

Published : Oct 6, 2022, 6:48 PM IST

'ఎల్​జీ గారూ తిట్టినట్టు నా భార్య కూడా రోజూ తిట్టదు. గడిచిన ఆరు నెల్లలో ఎల్​జీ రాసినన్ని ప్రేమలేఖలు నా భార్య కూడా రాసి ఉండదు' అంటూ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు చురకలు అంటించారు ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్​తో అభిప్రాయభేదాల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇటీవల తనకు లెఫ్టినెంట్ గవర్నర్ వరుసగా లేఖలు రాయడంపై ఇలా భిన్నంగా స్పందించారు. 'ఎల్​జీ గారు కాస్త శాంతించండి. మీ సూపర్​ బాస్​ను కూడా కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్పండి' అంటూ ట్విట్టర్​లో రాసుకొచ్చారు కేజ్రీవాల్.

kejriwal-delhi-lieutenant-governor-vk-saxena
కేజ్రీవాల్ ట్వీట్

మహాత్మా గాంధీ, లాల్​ బహదుర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాజ్​ఘాట్, విజయ్ ఘాట్​లో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరుకాకపోవడంపై ఆరాతీస్తూ ఇటీవల ఎల్​జీ వికే సక్సేనా.. దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దిల్లీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని లేఖలో మండిపడ్డారు. 'గాంధీ, శాస్త్రిలకు నివాళులు అర్పించే కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్​సభ స్పీకర్ సహా ఎంతో మంది అతిథులు వచ్చారు. మీరు గానీ, మీ మంత్రులు గానీ రాజ్​ఘాట్, విజయ్​ఘాట్​కు రాలేదు. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కొద్దినిమిషాలు ఉన్నప్పటికీ.. ఆయన ఈ కార్యక్రమాల్లో తగిన రీతిలో భాగం కాలేకపోయారు. దిల్లీ యంత్రాంగం నుంచి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా మీరు భాగం కాకపోవడం ఆమోదయోగ్యంగా కాదు' అంటూ వీకే సక్సేనా తన లేఖలో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.