ETV Bharat / bharat

'ఆ స్ట్రెయిన్​తో పిల్లలకు ముప్పు- విమానాలు ఆపండి' - సింగపూర్​ విమానాలు

కరోనా వైరస్ తొలి దశలో 45 ఏళ్లు పైబడిన వారిపై తీవ్ర ప్రభావం చూపింది. రెండో దశలో యువకులనూ వదల్లేదు. మూడో దశలో మాత్రం ఆ మహమ్మారి కన్ను చిన్నారులపై పడుతుందన్న ఆందోళనలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ ముప్పు సింగపూర్ వేరియంట్‌తో పొంచి ఉందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరిస్తున్నారు. అక్కడి నుంచి భారత్​కు విమాన సర్వీసులను నిలిపివేయాలని ప్రధానిని కోరారు.

author img

By

Published : May 18, 2021, 7:18 PM IST

చైనా వుహాన్ నగరంలో 2019 చివర్లో వెలుగుచూసిన కరోనా మహమ్మారి.. నాలుగు నెలలు తిరిగే సరికి ప్రపంచం మొత్తాన్ని కమ్మేసింది. ఐరోపాలో విలయం సృష్టించింది. చాలా దేశాలకు పీడకలను మిగిల్చింది. ఆ తర్వాత కాస్త సద్దుమణిగి ప్రపంచం కాలు చేయి కూడదీసుకొని నిలబడే లోపు.. రెండో సారి పంజా విసిరింది. యూకే స్ట్రెయిన్‌, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ల రూపంలో విధ్వంసం మొదలుపెట్టిన మహమ్మారి.. భారత్‌కు వచ్చే సరికి మహావిలయంగా మారింది.

తొలి దశలో అనేక దేశాల్లో ఆరుపదుల అనుభవమే లేకుండా పోయిన ఊర్లు అనేకం మిగిలాయి. రెండో దశలో మరింతగా బలపడిన వైరస్‌ ఉక్కుకండరాలు, ఇనుప నరాలు కలిగిన యువతను కూడా అమాంతం మింగేయడం మొదలుపెట్టింది. మొదటి దశలో ప్రపంచానికే దారిచూపిన భారత్‌ను రెండో దశ విజృంభణతో ప్రపంచదేశాల ముందు బేలగా మార్చింది. ఇక మూడో ముప్పు కూడా పొంచి ఉందన్న హెచ్చరికలు వస్తుండగా అది చిన్నారులను కూడా ఆబగా మింగేస్తుందన్న వాదనలు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.

సింగపూర్​ నుంచే ముప్పు..

కరోనా రెండో దశ విలయంలో భారత్‌ ప్రపంచశక్తి మొత్తాన్ని కూడదీసుకొని వైరస్‌పై పోరాటం చేస్తుండగా మూడో దశ ముప్పు సింగపూర్ వైరస్‌ నుంచి పొంచి ఉందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సింగపూర్‌లో గుర్తించిన ఈ స్ట్రెయిన్‌ చిన్నారులకూ ప్రాణాంతకం కావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అది భారత్‌కు విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ముప్పు నుంచి బాలభారతాన్ని కాపాడాలంటే.. వెంటనే సింగపూర్‌తో అన్ని విమాన సర్వీసులు రద్దు చేసుకోవాలన్నారు. దేశంలో చిన్నారుల వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు కేజ్రీవాల్​.

ఇదీ చూడండి:సహజీవనంపై హైకోర్టు సంచలన తీర్పు

విజయన్ 2.0: మంత్రివర్గంలో మొత్తం కొత్తవారే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.