ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- పాక్​ ఉగ్రవాది హతం

Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాదిని హతమార్చాయి భద్రతా బలగాలు. అతడిని లష్కరే తోయిబాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.

pakistani-terrorist-saifullah-alias-abu-khalid-of-let-killed
Kashmir Encounter
author img

By

Published : Dec 19, 2021, 6:44 PM IST

Pakistani Terrorist: జమ్ముకశ్మీర్​లో ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. శ్రీనగర్​లోని హర్వాన్​లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. ఓ ముష్కరుడు కాల్పులు జరిపాడు. ఇది ఎన్​కౌంటర్​కు దారి తీసింది. పోలీసులు, సీఆర్​పీఎఫ్​, సైన్యం కలిసి చుట్టుముట్టాయి. లొంగిపోయే అవకాశం కల్పించినా అతడు ఒప్పుకోలేదు. ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు.

ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్​, గ్రనేడ్లు సహా మందుగుండు సామగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

LET Terrorism in India: హతమైన వ్యక్తిని లష్కరే తోయిబాకు చెందిన పాకిస్థాన్​ ఉగ్రవాది సైఫుల్లా అలియాస్​ అబు ఖలీద్​గా గుర్తించారు. కరాచీ నుంచి 2016లో భారత్​లోకి చొరబడ్డాడని, కశ్మీర్​లో ఎన్నో ఉగ్రకార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడని కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు. ప్రస్తుతం సైఫుల్లా గ్రూప్​ కమాండర్​గా ఉన్నాడని చెప్పారు.

గత 33 రోజుల్లో ముగ్గురు పాకిస్థాన్​ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. లోయలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాక్​ ప్రయత్నిస్తుందనడానికి ఇదే రుజువు అని విజయ్​ కుమార్​ అన్నారు.

అనంత్​నాగ్​లో ఓ ఉగ్ర అనుచరుడిని అరెస్టు చేశారు పోలీసులు. అతడి వద్ద చైనీస్​ పిస్టల్​ సహా భారీగా మందుగుండు సామగ్రి దొరికింది.

ఇదీ చూడండి: కశ్మీర్​పై పాక్ మరో కుట్ర- ఉగ్రమూకలకు 'లౌకిక' ముసుగు!

Drone BSF: సరిహద్దుల్లో డ్రోన్​ కలకలం- పాకిస్థాన్​ పనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.