ఒకప్పుడు చాలా ప్రాంతాల్లో దళితులను గుడిల్లోకి అడుగు పెట్టేందుకు అనుమతినిచ్చేవారు కాదు. వారు దూరంగానే నిల్చుని దండం పెట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. పొరపాటున వారు గుళ్లోకి వస్తే కఠినంగా శిక్షించే వారు. అయితే ఈ లింగ వివక్షతను అడ్డుకునేందుకు కృష్ణ మోహన్ అనే వ్యక్తి.. కొంతమంది దళితులను వెంటబెట్టుకుని 2018లో కేరళలోని జడాధారి ఆలయంలోకి ప్రవేశించారు.
ఈ చర్యతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు దళితులను ప్రశ్నించారు. ఆచారాన్ని మట్టుబెట్టారని, దీని వల్ల దేవుడికి కోపం వస్తుందని దాదాపు నాలుగేళ్లు ఆ ఆలయాన్ని మూసివేశారు. ఇప్పటికి గుడిని తెరిచేందుకు గ్రామస్థులు ముందుకు వస్తున్నప్పటికీ కొన్ని వర్గాలవారు దీనికి ససేమిరా అంటున్నారు.
ఆలయంలోని జడధారి తెయ్యంతో పాటు అన్నదానాన్ని ప్రధాన వేడుకలుగా భావిస్తారు. చివరసారిగా 2018 నవంబరులో ఈ జడధారి తెయ్యం వేడుక జరిగింది. అయితే ఆ వేడుకలో నాల్‌కడయ్య దళిత సంఘం వారు ప్రత్యేక వేషధారణలో పాల్గొంటారు. అయితే వారిని కూడా ఆలయంలోని ప్రధాన ద్వారం వైపు నుంచి అనుమతించరు. నిర్దిష్టమైన ప్రదేశంలోనే వారు రావాల్సిందిగా నియమం ఉంది. అంతే కాకుండా వారి వద్ద నుంచి ఆశీర్వాదం తీసుకోకూడదన్న ఆంక్షలు సైతం ఉన్నాయి.
ఇదీ చదవండి: 550 బంగారు పొరలతో కేదార్నాథ్ గర్భగుడి అలంకరణ