ETV Bharat / bharat

కార్తికపౌర్ణమి స్పెషల్​- పండగ నాడు ఈ స్వీట్స్​ను తయారు చేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 6:01 PM IST

Kartik Purnima 2023 Special Sweets: కార్తిక పౌర్ణమి వచ్చేసింది. ఈ రోజున ఎప్పుడూ చేసేకునే స్వీట్స్​ కాకుండా వెరైటీగా చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఇది. నోరూరించే కలాకండ్​, చంద్రకళ ఎలా తయారు చేసుకోవాలో స్టెప్​ బై స్టెప్​ తెలుసుకుందాం..

Kartik_Purnima_2023_Special_Sweets
Kartik_Purnima_2023_Special_Sweets

Kartik Purnima 2023 Special Sweets: హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే. ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నదీ స్నానం, దీప దానం, ఉపవాసాలు అత్యంత విశిష్టమని.. యాగం చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కార్తిక పౌర్ణమికి ఏం ప్రసాదాలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీ కోసమే ఈ స్టోరీ. కార్తిక పౌర్ణమి నాడు ఈ స్వీట్స్​ను తయారు చేసి.. పండగను మరింత ఆనందంగా జరుపుకోండి..

కలాకండ్​..

How Make Kalakand Recipe in Telugu:

కావాల్సిన పదార్థాలు..

  • చిక్కటి మిల్క్ - రెండు లీటర్లు
  • చక్కెర - అరకప్పు
  • నిమ్మరసం లేదా వెనిగర్​-1 టీ స్పూన్​
  • నీళ్లు-అరకప్పు
  • బాదంపప్పు-5
  • పిస్తాపప్పు-5

కార్తికమాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? - పండితులు ఏం చెబుతున్నారు?

తయారీ విధానం:

  • ముందుగా ఓ మందపాటి గిన్నెను తీసుకుని స్టౌ మీద పెట్టి.. అందులో పావుకప్పు నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లల్లో రెండు లీటర్ల చిక్కటి పాలు పోసుకోవాలి.
  • తర్వాత మంటను హై ఫ్లేమ్​లో పెట్టి.. గరిటెతో పాలను కలుపుతూ ఉండాలి.
  • పాలు సగానికి మరిగిన తర్వాత.. సిమ్​లో పెట్టి అరకప్పు పంచదార వేసి కలుపుతూనే ఉండాలి. మీకు ఒకవేళ తీపి ఎక్కువ కావాలనుకుంటే మరికొంచెం షుగర్​ యాడ్​ చేసుకోవచ్చు.
  • తర్వాత ఓ చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక టీ స్పూన్​ వెనిగర్​ లేదా నిమ్మరసం వేసి పావుకప్పు నీళ్లు పోసుకోవాలి.
  • తర్వాత మరుగుతున్న పాలల్లో వెనిగర్​ నీటిని సగం పోసి కలపాలి. తర్వాత పాలను ఎక్కువ మంట మీద ఉంచి.. దగ్గరపడేంతవరకు కలుపుతూనే ఉండాలి.
  • మిశ్రమం దగ్గర పడిన తర్వాత స్టౌ ఆఫ్​ చేసి.. ఓ ప్లేట్​కు నెయ్యి రాసి అందులో ఈ పేస్ట్​ను వేసి సమానంగా స్ప్రెడ్​​ చేసుకోవాలి. ఇది సెట్​ అవ్వడానికి మినిమం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.
  • తర్వాత దానిని నచ్చిన షేప్​లో కట్​ చేసుకుని.. చివరిగా బాదంపప్పు, పిస్తాపప్పుతో గార్నిష్​ చేసుకుంటే.. కలాకండ్​ రెడీ..

కార్తిక పౌర్ణమి ఎప్పుడు - 26నా? 27వ తేదీనా?

చంద్రకళ స్వీట్​..

How to Make Chandrakala Recipe:

కావ‌ల్సిన ప‌దార్థాలు..

  • మైదా పిండి – ఒక‌టిన్న‌ర క‌ప్పు
  • ఉప్పు – చిటికెడు
  • వంట‌సోడా – చిటికెడు
  • నెయ్యి – పావు క‌ప్పు
  • పంచ‌దార – ఒక క‌ప్పు
  • నీళ్లు – అర క‌ప్పు
  • కుంకుమ పువ్వు – చిటికెడు
  • యాల‌కుల పొడి – కొద్దిగా
  • నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా
  • పచ్చికోవా-250 గ్రాములు
  • పంచ‌దార పొడి – 3 స్పూన్స్
  • వేయించిన ఎండు కొబ్బరి తురుము-2 టీ స్పూన్లు
  • వేయించి త‌రిగిన జీడిప‌ప్పు – కొద్దిగా
  • వేయించి త‌రిగిన బాదంపప్పు – కొద్దిగా
  • యాల‌కుల పొడి – పావు టీ స్పూన్

భక్తులకు అలర్ట్​ - కార్తిక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే!

చంద్ర‌క‌ళ స్వీట్ త‌యారీ విధానం..

  • ఓ గిన్నెలో మైదాపిండి, ఉప్పు, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత నెయ్యి వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి అరగంట పక్కన పెట్టాలి.
  • తర్వాతల ఓ గిన్నెలోకి పచ్చి కోవాను తీసుకుని అందులో పంచదార పొడి.. యాల‌కుల పొడి, డ్రై ఫ్రూట్స్ ప‌లుకులు, ఎండు కొబ్బరి తురుము వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ఈ కోవాను చిన్న నిమ్మ‌కాయంత ప‌రిమాణంలో ఉండ‌లుగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి.
  • ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మ‌రోసారి బాగా క‌లుపుకోని.. పిండిని ఉండలుగా చేసుకోవాలి.
  • ఒక్కో ఉండ‌ను తీసుకుని చ‌పాతీలా వ‌త్తుకోవాలి. త‌రువాత గుండ్రంగా ఉండే మూత‌తో చిన్న పూరీల ప‌రిమాణంలో వత్తుకోవాలి.
  • ఇప్పుడు ఒక పూరీని తీసుకుని దానిపై కోవా ఉండ‌ను ఉంచాలి. త‌రువాత పూరీ అంచుల‌కు నీటితో త‌డి చేసి దానిపై మ‌రో పూరీని ఉంచి అంచుల‌ను గట్టిగా వ‌త్తాలి.
  • అంచుల‌ను మ‌న‌కు న‌చ్చిన డిజైన్​లో చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకుని ప‌క్కకు ఉంచాలి.
  • త‌రువాత క‌ళాయిలో పంచ‌దార‌, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తర్వాత కుంకుమ పువ్వు, యాల‌కుల పొడి వేసి పంచ‌దార మిశ్ర‌మం జిగురుగా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.
  • త‌రువాత మరో క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా త‌యారు చేసుకున్న చంద్రకళను వేసి వేయించాలి.
  • వీటిని మీడియం మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి పంచ‌దార పాకంలో వేసుకోవాలి.
  • వీటిని రెండు వైపులా అటూ ఇటూ తిప్పుతూ 5 నిమిషాల పాటు ఉంచి ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి.

హరహర మహాదేవ.. కార్తీక సోమవారం శివపూజ ఇలా చేయాలి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.