ETV Bharat / bharat

1947 నుంచి త్రివర్ణ పతాకాన్ని కాపాడుతున్న కుటుంబం

75 ఏళ్ల క్రితం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎగిరిన జాతీయ పతాకమది. ఏళ్లు గడుస్తున్నా.. ఆ జెండాను ఓ కుటుంబం చెక్కు చెదరనివ్వకుండా కాపాడుతూ వస్తోంది. బంగారాన్ని దాచుకున్నట్లుగా.. ఆ జెండాను బ్యాంకు లాకర్లో భద్రపరుస్తోంది.

National Flag since 1947
1947నాటి జాతీయ పతాకంతో గంగాధర్​ కులకర్ణి
author img

By

Published : Aug 14, 2021, 10:01 PM IST

Updated : Aug 15, 2021, 7:30 AM IST

1947 నుంచి త్రివర్ణ పతాకాన్ని కాపాడుతున్న కుటుంబం

బ్రిటిష్​ పాలనకు చరమగీతం పలుకుతూ 1947లో మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. దేశ ప్రజలంతా అప్పుడు సంబరాల్లో మునిగితేలారు. త్రివర్ణ పతాకాలను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. మరి 75 ఏళ్ల క్రితం ఆనాడు ఎగరేసిన జాతీయ పతాకాన్ని ఇప్పటికీ చూడాలని ఉందా? అయితే.. కర్ణాటకలోని ధార్వాడ్​ జిల్లాకు వెళ్లాల్సిందే!

జిల్లాలోని గాంధీనగర్​కు చెందిన.. మాజీ పశువైద్యాధికారి గంగాధర్​ కులకర్ణి జాతీయ పతాకాన్ని 75 ఏళ్లుగా రక్షిస్తున్నారు. బ్యాంకు లాకర్​లో భద్రపరిచిన ఈ జెండాను.. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున బయటకు తీసుకువచ్చి, తన ఇంటి ముందు ఎగురవేస్తారు. ఆ మరుసటి రోజు మళ్లీ జెండాను బ్యాంకుకు తీసుకువెళ్లి ఆయన భద్రపరుస్తారు.

National Flag since 1947
జాతీయ పతాకంతో గంగాధర్​ కులకర్ణి, ఆయన భార్య

గంగాధర్ కులకర్ణి కుటుంబ సభ్యులతో పాటు, స్థానికులంతా గంగాధర్​ ఇంటివద్ద జెండా వందనం కార్యక్రమానికి హాజరవుతారు. అయితే.. కరోనా కారణంగా గత ఏడాది బయటివాళ్లను అనుమతించలేదు.

National Flag since 1947
జాతీయ జెండా భద్రపరిచిన పెట్టెతో కులకర్ణి

25 పైసలు చెల్లించి..

గంగాధర్​ 1947లో నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఆయనకు ఓ ఉపాధ్యాయుడు ఈ పతాకాన్ని అందించారు. అందుకు తన తల్లి 25 పైసలు చెల్లించింది. గంగాధర్​ కుటుంబం తమ నివాసాన్ని ధార్వాడ్​కు మార్చుకునేముందు.. తమ స్వగ్రామమైన నలత్​వాడ్​ గ్రామంలో ఈ జెండాను ఎగురవేశారు​. అదే రోజు ఈ పతకాన్ని ఆ ఊరిలో ఉన్న పాఠశాలలోను ఎగురవేశారు.

National Flag since 1947
1947నాటి జాతీయ పతాకంతో గంగాధర్​ కులకర్ణి

అప్పటి నుంచి బ్యాంకు లాకర్​లో..

2010 వరకు ఈ పతాకం గంగాధర్​ తల్లి వద్ద ఉండేది. తన తల్లి కోరిక మేరకు గంగాధర్​తో పాటు ఆయన కుటుంబం.. ఈ జెండాను కాపాడే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. నలత్​వాడ్​ నుంచి ధార్వాడ్​కు తమ నివాసాన్ని మార్చుకున్న తర్వాత.. ఈ జెండాను బ్యాంకు లాకర్లో పెట్టి గంగాధర్​ భద్రపరుస్తున్నారు.

National Flag since 1947
1947నాటి జాతీయ జెండా భద్రపరిచిన పెట్టె

"1947లో నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఆ సమయంలో దేశమంతటా స్వాతంత్య్ర సంబరాల్ని ఘనంగా జరుపుకున్నారు. ఇప్పడు 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకులు జరుపుకునే అవకాశాన్ని నేను చూస్తున్నందుకు సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాను. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం అంటే.. దేశ భక్తిని వ్యక్తపరచడమే."

-గంగాధర్​, మాజీ పశువైద్యాధికారి.

ఇదీ చూడండి: విదేశీ జంటను భారత రాజ్యాంగం కలిపిందిలా!

ఇదీ చూడండి: ఉగ్రవాదుల భారీ కుట్ర- అయోధ్య మందిరంపై నిఘా!

Last Updated : Aug 15, 2021, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.