Karnataka woman stabbed: కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. తనను తిరస్కరించిందన్న కారణంతో యువతిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కత్తితో పలుమార్లు శరీరంపై పొడిచి హత్యాయత్నం చేశాడు. దొడ్డబళ్లాపురలోని ఐబీ సర్కిల్లో ఈ ఘటన జరిగింది.
woman stabbed by lover
నిందితుడిని గిరీశ్(31)గా గుర్తించారు. బాధితురాలు 26 ఏళ్ల ప్రభావతి అని పోలీసులు తెలిపారు. ఆమె ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ప్రభావతి ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో గిరీశ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ గతంలో ప్రేమించుకున్నారు. వివాహం కూడా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇరువురి తల్లిదండ్రులు కూడా ఇందుకు అనుమతించారు. అయితే, మహిళ మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉందని గిరీశ్‌కు అనుమానం వచ్చింది.
దీంతో ప్రభావతిపై దాడికి పాల్పడ్డాడు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి గిరీశ్.. కత్తితో దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. మహిళ మెడ, వెన్ను, భూజాలపై గాయాలయ్యాయని తెలిపారు. గిరీశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: క్రికెట్ బాల్ కోసం భారీ ఫైట్.. రోడ్డుపై కర్రలు, రాళ్లతో కొట్టుకుంటూ...