ETV Bharat / bharat

బస్తాల్లో ఇసుక విక్రయం- ప్రభుత్వం యోచన - ఇసుక

సిమెంట్​ తరహాలోనే ఇసుకను బస్తాల లెక్కన ప్రభుత్వమే విక్రయిస్తే.. ఎంతో బాగుంటుంది కదా! ఇసుకాసురుల అవినీతి ఉండదు. వృథాను అరికట్టవచ్చు. నాణ్యమైన ఇసుకను నిర్ణీత ధరకే షాపుల్లో కొనుక్కోవచ్చు. ఈ దిశగానే ఓ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎక్కడంటే..

sand in sacks
బస్తాల్లో ఇసుక విక్రయం
author img

By

Published : Jul 1, 2021, 9:52 PM IST

ఇసుక విక్రయంపై నూతన విధానానికి శ్రీకారం చుట్టాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. సిమెంట్​ తరహాలోనే ఇసుకను బస్తాల చొప్పున అమ్మాలని భావిస్తోంది. ఈ మేరకు మొదట ప్రయోగాత్మకంగా ప్రారంభించడానికి ప్రణాళిక తయారు చేసింది. ఇలా చేయడం ద్వారా ప్రజలకు తక్కువ ధరలోనే నాణ్యమైన ఇసుకను అందించవచ్చని భావిస్తున్నట్లు కర్ణాటక గనుల శాఖ మంత్రి మురుగేశ్ ఆర్​. నిరని తెలిపారు.

ఎలా అమ్ముతారు?

"రాష్ట్ర వ్యాప్తంగా మొదట ఐదు స్థానాల్లో ఇసుక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ నాణ్యమైన ఇసుక తయారీ విధానం, ప్యాకేజింగ్​ వంటి పనులకు శిక్షణ ఇస్తారు. నాణ్యత ఆధారంగా ఇసుకను ఏ, బీ, సీ గ్రేడులుగా విభజిస్తారు. నదీ పరివాహక ప్రాంతాలను గ్రేడులుగా విభజిస్తారు. ప్రతి బస్తాను 50కేజీల చొప్పున తయారు చేస్తారు. దీంతో రవాణాలో కనీసం 25 నుంచి 30 శాతం ఇసుక వృథాను అరికట్టవచ్చు. బస్తాల్లో నింపటం వల్ల రవాణా ఖర్చులు తగ్గించవచ్చు. ఇసుక కొరతను అరికట్టవచ్చు" అని మురుగేశ్ తెలిపారు.

కర్ణాటక మినరల్​ కార్పొరేషన్ లిమిటెడ్​ (కేఎస్​ఎమ్​సీఎల్​), హుట్టీ గోల్డ్​ మైన్స్ కంపెనీ లిమిటెడ్​ (హెచ్​జీఎమ్​ఎల్​)ల ఆధ్వర్యంలో ఇసుకను వెలికితీయనున్నట్లు మురుగేశ్​ తెలిపారు. ముఖ్యమంత్రి యడియూరప్పతో చర్చించిన అనంతరం ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.